తెలంగాణ

కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: టీఆర్‌ఎస్ పాలనకు తెలంగాణలో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని హర్యానా వ్యవసాయ మంత్రి ఓం ప్రకాష్ దంకర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతాంగాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. హర్యానాలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని, రిస్క్ మేనేజిమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణలో అధికారం అంతా ఒకే కుటుంబం చేతిలో ఉందని, ఈ తరహా పాలన ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబ పాలనకు ఓటు వేయకుండా తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బీజేపీకి ఓటు వేయాలని ఆయన సూచించారు. బీజేపీ తెలంగాణలో మంచి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు, పాలనా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు అందులో ఉన్నాయని చెప్పారు.