తెలంగాణ

ఎన్నికల వ్యయాన్ని నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: దేశంలో ఎన్నికల వ్యయం పెరగడం వల్లనే అవినీతి పెరుగుతోందని, ఈ కారణంగానే మళ్లీ సంపాదించాలనే తపన పెరిగి అవినీతికి పాల్పడుతున్నారని ఎంపీ, బీజేపీ ప్రధానకార్యదర్శి వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. మంగళవారం నాడు శిల్పకళావేదిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వరుణ్ గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఎన్నికల ప్రణాళిక పేరుతో వరుణ్‌గాంధీ రాసిన గ్రంథాన్ని ఆయనే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనిధి విద్యాసంస్థలు నిర్వహించాయి. కార్యక్రమంలో శ్రీనిధి విద్యాసంస్థల చైర్మన్ కేటీ మహి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. గ్రామాలను ప్రభావితం చేస్తున్న అంశాలను వరుణ్‌గాంధీ ఈ గ్రంథంలో ప్రస్తావించారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుదుటపడాలంటే, గ్రామాల్లో రైతుల బతుకులు వెల్లివిరియాలంటే కొత్త విధానాలను, సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని వరుణ్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. అనేక రంగాల్లో భారత్ అనూహ్యమైన ప్రగతిని సాధించిందని, మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరిగిందని, ఆర్థిక వ్యవస్థ పటిష్టం అయ్యేలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వరదలా వస్తున్నాయని వరుణ్ పేర్కొన్నారు.