ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 5: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను యజ్ఞం చేస్తుంటే కొందరు రాక్షసుల మాదిరిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల వయస్సు తన అనుభవమంత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ ఎ కనె్వన్షన్ సెంటర్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై ఆయా రంగాలకు చెందిన అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వచ్చాయని, వాటికి అనుగుణంగా రైతుల్ని మలచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో జీవన ప్రమాణాలు పెరగటానికి వ్యవసాయం దోహదపడుతుందని, మన భవిష్యత్ మన చేతుల్లోనే వుందన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి 200 రూపాయలుగా వున్న పింఛన్లను వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు 1500 రూపాయలకు పెంచామని చెపుతూ పేదవారికి కుటుంబ పెద్దగా తాను వుంటానన్నారు. ఉపాధి హామీ పథకం కింద 196 రూపాయలు కూలి ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెపుతూ ప్రతిఒక్కరిలో స్ఫూర్తి అవసరమన్నారు. చదువు ముఖ్యమని, చదువుకన్నా పద్ధతులు ఇంకా అవసరమన్నారు. విశాఖపట్నంలో పరిశ్రమలున్నాయని, కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగం బాగుందని, ఈ రెండు జిల్లాలు తలసరి ఆదాయంలో పోటీపడుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తాము చేసిన పాదయాత్రలో రైతుల కష్టాలను చూశామని, 7 గంటలకు ఒక్క నిమిషం తక్కువ కాకుండా వ్యవసాయ విద్యుత్ ఇస్తున్నామన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రానివ్వమని, రూ.20 వేల కోట్ల రుణమాఫీ దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే చేయగలిగిందన్నారు. ‘మీ అప్పు నా భుజస్కంధాలపై మోస్తున్నా’ అని ఆయనన్నారు. తెలంగాణలో ఆదాయం వుందని, అయినప్పటికీ రైతులకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో లక్షన్నర ఇచ్చామన్నారు. జలవనరుల రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. పంట సంజీవని కింద పంట ఎండిపోకుండా రెయిన్ గన్‌ల ద్వారా కాపాడతామన్నారు. కరవు మనల్ని చూసి భయపడాలని ఆయనన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకు ఆధునిక పద్ధతులు అవలంభిస్తామని, రైతులు బంగారాన్ని సైతం పండించగలరన్నారు. ధాన్యం నిల్వలకు గిడ్డంగులు పెంచుతామని, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామన్నారు. చేపలు, రొయ్యల పెంపకానికి ప్రాధాన్యత వుందని, దేశంలో చేపల పెంపకంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో వుందన్నారు. పంటలను పండించడానికి అనుమతులను సరళీకృతం చేస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే రైతులు తమ భూములను ఇచ్చారని, కొందరు లక్ష కోట్ల అవినీతి జరిగిపోయిందని రాద్ధాంతం చేస్తున్నారంటూ లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి నాయకులను ప్రజలే ఛీకొట్టాలని, రాజకీయాల నుండి శాశ్వతంగా ఇంటికి పంపేయాలన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నీటి సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో పాటు అన్ని రాష్ట్రాల్లో అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బాబు.ఎ, సబ్ కలెక్టర్ డా. జి సృజన, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, జిల్లా టిడిపి అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.