ఆంధ్రప్రదేశ్‌

భూగర్భ జలాల అభివృద్ధితో నీటి సమస్యకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌ఎన్ పేట, జూన్ 5: భూగర్భ జలాలు అభివృద్ధి చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించవచ్చని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, ఎల్‌ఎన్ పేట మండలంలోని సవరకొత్తబాలేరు గిరిజన గ్రామంలో ఆదివారం నీటిగుంతలు, కోయిలాంలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడారు. భవిష్యత్‌లో నీటి సమస్య లేకుండా ముందుచూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం, పంట సంజీవిని, నీటిగుంతలు, వీటితో పాటు చెరువుల అభివృద్ధికి నీరు-చెట్టు పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యధిక నిధులు మంజూరు చేస్తామన్నారు.
అర్హులకు రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు
అర్హులై లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఎల్‌ఎన్ పేట మండల కేంద్రంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మండలంలో వెయ్యి మంది రేషన్‌కార్డులు, 2,500 మంది గ్యాస్ కనెక్షన్లు, 770 మంది పింఛన్లకు దరఖాస్తులు చేశారని తెలిపారు. అర్హులకు త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు. ఈ మండలంలో తలసరి ఆదాయం పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నామన్నారు. అభివృద్ధిలో అగ్రస్థానం ఉండే విధంగా ఎల్‌ఎన్ పేటను తీసుకొస్తామన్నారు. అంతకుముందు రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, కలెక్టర్ లక్ష్మీనృసింహం, ఎస్పీ బ్రహ్మారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.