తెలంగాణ

పచ్చటి భూముల్లో ప్రాజెక్టులొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 5: నదులమీద నిర్మించాల్సిన రిజర్వాయర్లను బహుళ పంటలు పండే పచ్చటి భూముల్లో నిర్మిస్తూ గ్రామాలను ముంపునకు గురిచేయడం సరికాదని తెరవే (తెలంగాణ రచయతల వేదిక) అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డకిష్టాపూర్‌లో గ్రామస్థుల దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. చిన్నచిన్న రిజర్వాయర్లతో గ్రామాలు ముంపునకు గురిచేయకుండా సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టకుండా ప్రభుత్వం ఏకంగా 50 టిఎంసిల మేర ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. 10 టిఎంసిల చొప్పున గ్రామాలు ముంపునకు గురికాకుండా వృథాగా ఉన్న ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో వేలాదిమందికి మేలు చేకూర్చుతుందని చెప్పి గ్రామాలను ముంచడం సరికాదన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం మంచిది కాదని, ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకోకుండా రచయితలు, కవులు ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పాటులో ముఖ్యభూమిక పోషించిన మేథావులు, కవులు, రచయితలు ప్రభుత్వానికి వత్తాసుపలకకుండా నష్టపోతున్న ప్రజల పక్షాన నిలబడి ఒత్తిడి తేవాలన్నారు. గ్రామాలు ముంపునకు గురైతే ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు కొరవడి ఎక్కడికి పోయినా వలసవాదులుగా పిలవబడుతారన్నారు. ప్రజలు జీవించే హక్కును కూడా ప్రభుత్వం కాలరాయడం సరికాదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కొంతమంది ప్రజలను ముంచి మరికొంతమందికి మేలు చేకూర్చడం సరికాదన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు నడుచుకోవాలన్నారు. సిఎం నియోజకవర్గంలోని ఎల్కల్ గ్రామంలో 27మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆ కుటుంబాలను ఆదుకోలేదన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి న్యాయం కోసం నిరంతర పోరాటానికి సన్నద్దం కావాలన్నారు. గ్రామస్తులతో బృందం సభ్యులు మాట్లాడి పూర్తివివరాలు తెలుసుకొని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు భానుమూర్తి, కృష్ణమాచారి, లలిత, అన్వర్, మహ్మద్‌పాషా, రాజిరెడ్డి, మల్లారెడ్డి, విక్రం, స్ఫూర్తి, సుధాకర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.