తెలంగాణ

గొంతు కేన్సర్‌పై అవగాహన సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: సమాజంలో గొంతు కేన్సర్‌పై అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయడానికి ‘అపోలో’చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయని డాక్టర్ దిలీప్ మాథాయ్ అన్నారు. గొంతు కేన్సర్‌పై రెండు రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినంధించారు. లారిన్‌జెక్టోమీ సొసైటీ ఆధ్వర్యంలో గొంతు కేన్సర్‌పై జరుగుతున్న సదస్సులకు ఆదరణ లభించిందని అన్నారు. వ్యాధికి ఆపరేషన్ చేయించుకుని, స్వరపేటికను తొలగించుకుని విజయవంతంగా బయటపడ్డ బాధితులు సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అపోలో కేన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఉమానాథ్ నాయక్ మాట్లాడుతూ వివిధ సంస్థలు ముందుకొచ్చి రోగులకు ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. అలాగే మాతా శిశు సంరక్షణపై జరిగే అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌లో అపోలో యాజమాన్యం ఆతిథ్యం ఇచ్చింది. ఆసుపత్రి గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాపరెడ్డి సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ప్రసవాలు, స్ర్తి సంబంధిత వైద్యం, సంతానోత్పత్తి, చిన్నారులు, నవజాతి శిశువుల వైద్యానికి సంబంధించిన అంశాలపై నేషనల్ క్రెడిట్ కాన్ఫరెన్స్ సదస్సులు ఏర్పాటు చేశామన్నారు.