తెలంగాణ

చెరువులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు అందనున్నాయి. రాష్ట్రంలోని 45వేల చెరువులను దశలవారీ పునరుద్ధరించాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రారంభించింది. గత రెండేళ్ల నుంచి మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీసి చెరువును పునరుద్ధరిస్తున్నారు. అయితే రెండేళ్ల నుంచీ వర్షాలు లేకపోవడంతో చెరువుల పూడిక తీసివేత పనులు చురుగ్గా సాగినా నీరు చేరలేదు. ఇప్పుడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ ముందు చెప్పినట్టే వర్షాలు కురుస్తుండటంతో జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. చెరువులవారీగా నీటి మట్టం వివరాలు ప్రతి రోజు నమోదు చేయాలని సూచించారు. చెరువులున్న ప్రాంతాల్లో వర్షపాతం నమోదు చేసి వివరాలు పంపించాలని మంత్రి కోరారు. మిషన్ కాకతీయ మొదటి దశ పూరె్తైంది. రెండో దశ పనులు సాగుతున్నాయి. మూడో దశ పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల వరుస కరువు తరువాత ఈ ఏడాది మంచి వర్షాలు ఉంటాయని ముందుగానే వాతావరణ శాఖ సూచించడంతో వర్షాకాలం లోపే మిషన్ కాకతీయ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయ ప్రారంభించిన తరువాత దాదాపు తొమ్మిది వేల చెరువుల పూడిక తీసివేత పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయి. మిగిలిన వాటికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కురిసిన వర్షాలు, కురిసే వర్షాలు ఈ తొమ్మిది వేల చెరువుల నీటితో కళకళలాడనున్నాయి. శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో పలు చెరువులుకు భారీగా నీరు చేరింది. చెరువుల వారీగా నీటి మట్టం వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా భారీ వర్షాలకు చెరువు కట్టలు తెగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల మంత్రి హరీశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని ఎస్‌ఇలకు సూచించారు. విఆర్‌ఓ, ఎంఆర్‌ఓ, ఎండివో తదితర అధికారులను సమన్వయం చేసుకొని వరద సమయాల్లో చెరువులను కాపాడాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను హరీశ్‌రావు కోరారు. వర్షాకాలంలో జెఇ, ఎఇ ఇతర అధికారులు హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించారు.
వర్షాలు ప్రారంభమైనందున అన్ని చెరువుల తూములు మూసి ఉంచాలని, గేట్లులేని వాటికి గేట్లు అమర్చాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న మిషన్ కాకతీయ ఫలితాలు ప్రజలకు అందాలంటే ఈ సీజన్‌లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిందిస్థాయి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని నీటిపారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లను కోరారు.

నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు

బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టురట్టు ౄ పాస్ పోర్టులు, నకిలీ డాక్యుమెంట్లు సీజ్

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జూన్ 5: చదువులేకపోయినా పాస్ పోర్టుకు కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను సృష్టించి పాస్‌పోర్టులు ఇప్పిస్తూ భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. నకిలీ పాస్‌పోర్టు పొందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఎండి.కమ్రుద్దీన్, హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరు నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి, నకిలీ ధ్రువపత్రాలు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ డి.జోయల్ డేవిస్ ఆదివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి ముఠా సభ్యులను మీడియా ఎదుట హాజరుపరిచారు. నిందితులిద్దరూ కలసి చదువులేని వారికి సైతం ఉన్నత చదువులు చదువుతున్నటుగా నకిలీ ధ్రువపత్రాలను తయారుచేసి పాస్‌పోర్టులు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం హైదరాబాద్‌లో సత్తార్‌ను అరెస్ట్ చేసి, అతని ఇంటి నుంచి అన్ని రకాల నకిలీ సర్ట్ఫికెట్లు, 25 పాస్‌పోర్టులు, రెండు కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్‌ను స్వాధీనం చేసుకుని కరీంనగర్‌కు వచ్చారు. కమ్రుద్దీన్, సత్తార్‌లను ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా 25 పాస్‌పోర్టులను ఇప్పించినట్లు, మరో నాలుగు దరఖాస్తులు వారి వద్ద ఉండగా, వాట్నంటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. ఒక్కో పాస్‌పోర్టుకు 35వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. నకిలీ ధ్రువపత్రాలతో ఎంతమంది పాస్ పోర్టు పొందారో, సత్తార్‌కు రాష్ట్రంలో ఎంతమంది ఏజెంట్లు ఉన్నారో అనే దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. పాస్‌పోర్టు పొందాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం నిర్ధేశించిన మీసేవా కేంద్రాల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.