తెలంగాణ

మెజార్టీతో టీఆర్‌ఎస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 8 : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి.. రెండవ సారి అధికారం చేపట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ఎగ్జిట్ సర్వేలన్ని టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలమని వెల్లడించాయన్నారు. శనివారం మంత్రి హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడుతూ సిద్దిపేట నియోజక వర్గంలో పెద్దఎత్తున ఓట్లు వేసి చైతన్యాన్ని చాటిన నియోజక వర్గ ప్రజలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా సిద్దిపేటలో 79శాతం పోలింగ్ జరగటం అభినందనీయమన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలు తమ స్పూర్తిని చాటారని కొనియాడారు. 2014 ఎన్నికల కంటే అధికంగా 5శాతం పోలింగ్ పెరిగిందన్నారు. గ్రామాల్లో 85 శాతం నుండి 90శాతంకు పైగా ఓటింగ్ జరగటం గర్వంగా ఉందన్నారు. ప్రజల సామాజిక చైతన్యానికి, అభివృద్ధి, ఆకాంక్షకు, సంక్షేమ బాటలకు ఈ పరిణామాలు సూచిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, రైతులు,వృద్ధులు, యువకులు, మహిళల పాత్ర చాల కీలకమని అభివర్ణించారు. విదేశాల్లో ఉండేవారు, దేశంతలో ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, హైదరాబాద్ నగరంలో ఉన్నవారు సైతం స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం గర్వకారణమన్నారు. ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య యుతంగా అధికారులు, పోలీసులు, పోలిసు సిబ్బంది ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి భేష్
గత మూడు నెలల నుండి సిద్దిపేట నియోజక వర్గంలో అవిశ్రాంతంగా కృషిచేసిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కృషిచేశారని మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తనకు భారీ మెజార్టీ అందించేందుకు అహార్నిశలు కృషిచేశారన్నారు. అందరి కృషితోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని స్పష్టం చేశారు.