తెలంగాణ

అధికారంలోనే సారు..కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 8: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా పోలింగ్ జరిగిందని, మరోసారి అధికారంలోనే సారు..కారు ఉండబోతున్నాయని మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. శనివారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈనెల 11న ఓట్ల లెక్కింపు అనంతరం ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీ ఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా తెరాస పవనాలు వీచి, తమ పార్టీ అభ్యర్థులు గెలవబోతుంటే, స్థానికంగా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు చెప్పుకోవటం సముచితం కాదన్నారు. సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలవబోతుందనే విషయం తేటతెల్లమై, పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నగరంలోని కార్ఖానగడ్డలో గల పోలింగ్‌బూత్‌లో అక్రమాలకు పాల్పడే యత్నం చేశాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన గంటల తరబడి పోలింగ్ బూత్‌లో తిష్టవేశాడని మండిపడ్డారు. దీనిని గమనించిన తమ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయగా, పోలీసులు లాఠీ చేయటం సముచితం కాదన్నారు. దీనిని అడ్డుకునే యత్నం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్‌పై కూడా లాఠీచార్జీ చేయటం హేయనీయమన్నారు. ఎన్నికల కమీషన్ విధించిన నిబంధనలు అన్ని పార్టీలకు, అభ్యర్థులకు పారదర్శకంగా వర్తింపజేయాల్సిన పోలీసులు, కొందరి కొమ్ముకాస్తు వ్యవహరించారని విమర్శించారు. కండువా ధరించిన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పోలింగ్ బూతుల్లో పర్యటించినా, పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ అడ్డుకోకపోవటం శోచనీయమన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేకపోవటం వెనుక ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. అకారణంగా తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయటం ఇతర పార్టీ ల అభ్యర్థుల ఒత్తిడే కారణమని అన్నారు. షాడో టీములు ఏర్పాటు చేసి, అభ్యర్థుల వెంట తిప్పుతున్నామని చెప్పుకునే యంత్రాంగం, వాటిని ఎక్కడ తిప్పుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తెరాస కార్యకర్తకు మెరుగైన వైద్య చికిత్సలు చేయిస్తున్నట్లు, సంఘటనకు కారకులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.