తెలంగాణ

జైళ్ల ద్వారా ప్రభుత్వానికే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 5: ప్రభుత్వం అందించే నిధుల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఆర్థిక వనరులను కల్పించే కొత్త పారిశ్రామిక విధానం ద్వారా జైళ్లను అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రభుత్వానికే నిధులు సమకూర్చే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ డిజి వికె.సింగ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆదివారం జైలు మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిజి మాట్లాడుతూ, తమ శాఖను అన్ని విధాలుగా అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా కొత్త పారిశ్రామిక విధానం ద్వారా ఖైదీలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయించి వాటిని మార్కెట్‌లో విక్రయించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటి వరకు 5 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించగా మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మూడు పథకాల్లో ఒకటైన హరితహారం కార్యక్రమం ద్వారా జైళ్లలో 4 లక్షల మొక్కలను నాటించి వాటి ఫలాలను త్వరలోనే పొందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. జైళ్లలో ఉంటున్న ఖైదీల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇందుకుగాను ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు తాము చేపట్టిన చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. 2013లో 53 మంది మరణిస్తే, 2014లో 40 మంది, 2015లో 27 మందికి, ఈ యేడాది ఆరు నెలల్లో కేవలం ఏడుగురు ఖైదీలు మాత్రమే మరణించారన్నారు.