తెలంగాణ

పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి, 36 రాజకీయ పార్టీలకూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కల్పించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి, పార్లమెంటులోని 36 రాజకీయ పార్టీల నేతలకూ లేఖలు రాశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్‌పి, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డిఎంకె, ఆర్‌జేడీ, డిఎంకె, నేషనలిస్టు కాంగ్రెస్, పీఎంకె, సీపీఎం, సీపీఐ, బిజు జనతాదళ్, మజ్లిస్ తదితర పారీజ్టలకు ఆయన లేఖలు రాశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గుతాయని ఆయన ఆ లేఖల్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు, అంతకు ముందు 2012లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని తీర్పు చెప్పినందున దీనిని అధిగమించడానికి శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కృష్ణయ్య కోరారు.