తెలంగాణ

అన్నీ సర్వేలూ టీఆర్‌ఎస్‌కు అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ముందస్తు ఎన్నికల పోలింగ్‌లో అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఇచ్చాయని ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకుడు మహేష్ బిగాల తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లే, ఎన్నికల పోలింగ్‌కు ముందు తాము టీఆర్‌ఎస్ విజయం కోసం పర్యటించామని ఆయన చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అంటే తమకే కాకుండా ప్రతి ఒక్కరికీ గౌరవం ఉండేదని, అయితే ఆయన ప్రజా కూటమితో జత కట్టడంతో గౌరవం పోయిందని మహేష్ బిగాల తెలిపారు. ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్నారు.