తెలంగాణ

అలుపెరుగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేంత వరకూ పోరాటం చేయాలని బీసీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లో విద్యుత్తు బీసీ ఉద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జికే వీర భద్రయ్య, ప్రధాన కార్యదర్శి జెడ్‌వి జ్ఞానేశ్వర రావు తెలిపారు. ఆదివారం జరిగిన బీసీ ఉద్యోగుల సమావేశానికి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, ఉదయ్ కుమార్ యాదవ్, రాంబాబు, విజయ్ బాబు, జి. రవికుమార్, రామకృష్ణ, జి. కృష్ణయాదవ్, వెంకట నారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీ విద్యుత్తు ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు అడ్డంకులు లేవని ఆయన తెలిపారు.