తెలంగాణ

సీఎం కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: సీఎం కేసీఆర్‌కు రెండు చోట్ల ఉన్నాయని, అలా ఉండటం రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం నేరమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో నంబర్ వైకెఎం 1804400తో ఒక ఓటు, చింతమడకలో మరో ఓటు నంబర్ ఎస్‌ఎజివో399691తో రెండు చోట్ల కేసీఆర్‌కు ఓట్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను రేవంత్‌రెడ్డి మీడియాకు చూపించారు. ఎవరైనా ఒక వ్యక్తి ఓటర్ల జాబితా తయారీ, లేదా సవరణలో ఒకటి కంటే ఎక్కువ చోట్ల తమ పేర్లు నమోదు చేసుకొని ఉంటే, ఒక ఓటును తొలగించడానికి రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ తెలిసి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అయితే సదరు వ్యక్తికి ఏడాది జైలు శిక్షా లేదా జరిమానా లేక రెండు శిక్షలు విధించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని రేవంత్‌రెడ్డి వివరించారు.