తెలంగాణ

31 జిల్లాల్లో 41 లెక్కింపు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు పోలైన ఓట్లను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 41 కేంద్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 13 నియోజకవర్గాలకు 11 కేంద్రాలు ఏర్పాటు కాగా, మిగతా 30 జిల్లాలకు సంబంధించి 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ యా జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒకే భవన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. కుమరంభీ-ఆసిఫాబాద్‌కు సంబంధించిన రెండు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ఆసిఫాబాద్‌లోని సోషియల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది. మంచిర్యాలలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంచిర్యాలలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్‌లోని టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్మల్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో, కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కామారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో జరుగుతుంది. జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలోని విఆర్‌కే ఎడ్యుకేషన్ సొసైటీ భవనంలో జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంథనిలోని జేఎన్‌టీయూహెచ్ భవన ప్రాంగణలో జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కాలేజీలో, రాజన్న సిర్లిల్లా జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తంగళ్లపల్లిలోని సోషియల్ వెల్ఫేర్ స్కూల్‌లో నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీ భవనంలో, మెదక్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సిద్ధిపేటలోని వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో, సిద్ధిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సిద్దిపేటలోని ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవనంలో చేస్తారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎనిమిది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పాల్మాకులలోని బీసీ రెసిడెన్షియల స్కూల్‌లో, వికారాబాద్ జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వికారాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో చేస్తారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కీసరలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, భోగారంలో చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పీజీ ఇంజనీరింగ్ కాలేజీలో, నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మూడు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లికొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహిస్తారు. వనపర్తి జిల్లాకు చెందిన వనపర్తి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు న్యూ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ భవనంలో, జోగులాంబ-గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గద్వాలలోని ఎస్‌కేటీర్ కాలేజీ పాతభవనంలో చేస్తారు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు దుప్పలపల్లిలోని టీఎస్ హౌసింగ్ వేర్‌హౌస్ కార్పొరేషన్ భవనంలో, సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో నిర్వహిస్తారు. యాదాద్రి-్భవనగిరి జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో, జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పెంబర్తిలోని వీబీఐటీలో చేస్తారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్‌లోని ఫాతిమా హైస్కూల్‌లో, వరంగల్ (రూరల్) లోని రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కమిటీ యార్డులో జరుగుతుంది. వరంగల్ (అర్బన్) జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎనుమాముల ఎంఎల్‌ఎస్ గోదాములో జరుగుతుంది. జయశంకర్-్భపాలపల్లి జిల్లాలోని రెండు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ భవనంలో,ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది.
హైదరాబాద్‌లో 11 కేంద్రాలు
హైదరాబాద్ జిల్లాలోని ముషీరాబాద్, నాంపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎల్‌బీ స్టేడియం (బ్యాడ్మింటన్) లో, మలక్‌పేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్‌లో, అంబర్‌పేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నారాయణగూడాలోని బీవీఆర్ రెడ్డి కాలేజీ భవనంలో జరుగుతుంది. ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గుడాలోని కేవీబీ రెడ్డి స్టేడియంలో, సనత్‌నగర్ ఓట్ల లెక్కింపు తార్నాకలోని ఓయూ కామర్స్ బిల్డింగ్‌లో, కార్వాన్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మసాబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్కిక్ కాలేజీలో, గోషామహల్ నియోజవర్గం ఓట్ల లెక్కింపు కోటిలోని ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. చార్మినార్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని కేఎన్ పాలిటెక్నిక్ కాలేజీలో, యాకుత్‌పురా నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని వనిత కాలేజీలో, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నిజాంకాలేజీ లైబ్రరీ భవనంలో బహద్దుర్‌పురా నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మసాబ్‌ట్యాంక్‌లోని శాంతినికేతన్ విద్యాభవన్‌లో, సికింద్రాబాద్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్‌ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనంలో, సికింద్రాబాద్ కంటోనె్మంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సీఎస్‌ఐఐటీ వెస్లీ కాలేజీ భవనంలో జరుగుతాయి.