తెలంగాణ

హంగ్ వస్తే.. బీజేపీ ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ముందస్తు ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే ఏమిటీ పరిస్థితి? అనే ప్రశ్నకు మజ్లిస్ సహకారంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది అందరూ ఊహిస్తున్నదే. కారణం టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేశామని మజ్లిస్ నేతలు బాహటంగానే చెబుతున్నారు. కానీ మజ్లిస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తామన్న ధీమా, నమ్మకంతో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం ప్రజా కూటమికి మద్దతునిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాత్రం తాము టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలంటే ఆ పార్టీ మజ్లిస్ దోస్తీని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమకు ఎవరి మద్దతు అవసరం పడదని ఖరాఖండిగా చెప్పారు. తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం రాదన్నారు. ఇలాఉండగా బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ హంగ్ ఏర్పడితే టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తామన్నారు. కానీ కేసీఆర్ మజ్లిస్‌తో కలవకూడదన్న షరతు విధించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జత కలవడం అప్రజాస్వామికమన్నారు.
ఎవరికీ మద్దతునివ్వం
ఇలాఉండగా హంగ్ వచ్చినా తమ పార్టీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు.