రాష్ట్రీయం

స్ట్రాంగ్ రూంలపై ఫ్రంట్ ‘డేగ’కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఈవీఎంలను దాచిన స్ట్రాంగ్ రూంలపై ఫ్రంట్ కూటమి డేగకన్ను వేసి ఉంచింది. కేసీఆర్ కనుసన్నల్లోనే ఎన్నికలు జరిగాయని భావిస్తున్న ప్రజాఫ్రంట్ కూటమి ఇప్పుడు ఎక్కడా తప్పు జరగకుండా చూడాలని భావిస్తోంది. ప్రజలు వేసిన ఓట్లు దాగి ఉన్న ఈవీఎంలను ఎవరు, ఎలాంటి పరిస్థితిలో ట్యాంపరింగ్ చేయకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను నిశిత పరిశీలనలో ఉంచారు. వాస్తవంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ ఈవీఎంల భద్రతపై అనేక చర్యలు తీసుకున్నారు. 119 శాసనసభా నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూంలలో ఉన్నాయి. స్ట్రాంగ్ రూంల చుట్టూ పట్టిష్టమైన భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంల వైపు ఎవరినీ అనుమతించడంలేదు. అయినప్పటికీ, ఫ్రంట్ నేతలు స్ట్రాంగ్ రూంలపై ఒక కనే్నసి ఉంచారు. ఇలా ఉండగా ఓట్ల లెక్కింపునకు (కౌంటింగ్‌కు) ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 11 న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. తొలుత ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఓటర్ల సంఖ్యను అనుసరించి ఎన్ని రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందో వెల్లడవుతోంది. ఉదయం 10 గంటల వరకే మెజారిటీ ఎలా ఉందో వెల్లడవుతుందని భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.

చిత్రం..నాగర్‌కర్నూల్‌లో ఈవీఎంలను దాచిన స్ట్రాంగ్ రూం