తెలంగాణ

అన్నీ కారు కూతలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 5: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన అనుమతుల మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని, అవగాహన లేని రేవంత్‌రెడ్డి ఓ బచ్చాలా కారు కూతలు కూస్తున్నాడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేసారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన జైలు మ్యూజియాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జైళ్ల శాఖ డిజి వికె.సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి ప్రభుత్వం నిర్మించడానికి ముందుకు వెళ్తే.. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్, టిడిపి నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆరు నూరైనా సరే ప్రాజెక్టులను నిర్మించితీరుతామన్నారు. చంద్రబాబు, జగన్‌లు సైతం తెలంగాణ ప్రాజెక్టులకు మోకాలడ్డు వేస్తుంటే తెలంగాణకు చెందిన టిడిపి నేతలు తిరుపతిలో నిర్వహించిన మహానాడులో తీర్మానం చేయడం సిగ్గు చేటన్నారు. అలాంటి వారు తెలంగాణాలో ఎలా తిరుగుతారో తేల్చుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజకీయ వ్యభిచారిగా అభివర్ణిస్తున్నారని, వాళ్ల ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దమ్ము లేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సిఎంపై విమర్శలు చేయడం చేతకానితనానికి నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదా? అప్పుడు ఈ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు వౌనంగా ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. జైలు మ్యూజియం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా దేశానికి ఆదర్శంగా నిలస్తుందని సంతృప్తిని వ్యక్తం చేసారు. మ్యూజియాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జైళ్ల శాఖ అదనపు డిజి నర్సింహ పాల్గొన్నారు.

పెనుగాలుల బీభత్సం
ఆదిలాబాద్ అతలాకుతలం ౄ 152 గ్రామాల్లో అంధకారం

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూన్ 5: ఆదిలాబాద్ డివిజన్‌లో శనివారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సం అల్లకల్లోలం సృష్టించింది. భీకరమైన పెనుగాలుల తాకిడికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆదిలాబాద్, జైనథ్, తాంసి, తలమడుగు, బేల, గుడిహత్నూర్ మండలాల్లోని 152 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి రెండు రోజులు గా అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. శనివారం అర్ధరాత్రి ప్రచండ గాలులతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. పట్టణంలోని శివారు కాలనీలైన దుర్గానగర్, ఖానాపూర్, రాంనగర్, కెఆర్‌కె కాలనీ, ఆదిలాబాద్ మండలంలోని జంధాపూర్, లొద్దిగూడ గ్రామాల్లో ఇంటిపై కప్పులు, రేకులు గాలికి ఎగిరిపోయి నిలువ నీడ లేకుండా నిరాశ్రులయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీ ఆర్ చౌక్, విద్యానగర్, కలెక్టరేట్, క్యాంపు ఆఫీసు, గాంధీపార్కు, రాంలీలా మైదాన్ కాలనీల్లో భారీ ఎత్తున గాలివాన కారణంగా సుమారు 70కి పైగా భారీ వృక్షాలు నేలకూలాయి. ఫైర్‌స్టేషన్ వద్ద 50 ఏళ్ల కింద నాటిన భారీ వృక్షాలు నేలమట్టం కావడం గమనార్హం. ఈ రోడ్డుపై అర్ధరాత్రి జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పట్టణంలోని 75కు పైగా విద్యుత్ స్తంభాలు, పది ట్రాన్స్‌ఫార్మర్లు భారీ గాలివానకు దెబ్బతిన్నాయని, కేబుల్ వైర్లు తెగిపడి విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అశోక్ తెలిపారు. ఆదిలాబాద్ డివిజన్‌లో 120కి పైగా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, వైర్లు తెగిపడడంతో వీటిని యుద్దప్రాతిపదికన పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. అయితే శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఆదిలాబాద్ డివిజన్ ప్రజలు ఉక్కపోత మద్య అందకారంలో మగ్గాల్సి వచ్చింది. పలు గ్రామాల్లోను ఇదే పరిస్థితి నెలకొనడంతో సామాన్య జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తాగునీరు లేక, కాలకృత్యాలు, స్నానాల కోసం బోరునీరు తోడేందుకు కరెంటు లేక పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. గత పదేళ్లలో ఇంతటి బీభత్సం ఎప్పుడు చూడలేదని పలువురు పేర్కొన్నారు. అయతే తాగునీటిని దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్‌లో గంట సేపు ఇతర పీడర్లద్వారా కరెంటు సరఫరా కొనసాగించారు. ఇక భారీ పెను గాలుల ధాటికి పట్టణంలో నాలుగు రోజుల కిందట ప్రారంభించిన క్రాప్ట్ ఇండియా మేళా దుకాణాలు ఎగిరిపోవడంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్థినష్టం ఏర్పడిందని బాధితులు పేర్కొన్నారు. జైనథ్, తాంసి, బేల మండలాల్లో భారీ వర్షానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.