తెలంగాణ

అందరి చూపు..గజ్వేల్ పైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 9 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుండి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, మహాకూటపి పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ పార్టీ పక్షాన ఆకుల విజయ బరిలో నిల్చున్నారు. ఈ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిల పాత కాపుల మధ్యనే జరిగిన హోరాహోరీ పోరు అందర్శి ఆకర్శిస్తుంది. గజ్వేల్ నియోజక వర్గంతో ఈ ఎన్నికల్లో 88.63 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజ్వేల్ 2, 33,207 ఓట్లకు 2,06,699 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,04,457 పురుషులు, 1,02,239 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 జరిగిన ఎన్నికల్లో 84.22 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, ఈ సారి 4.41 శాతం అధికంగా 88.63 పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్‌లో నియోజక వర్గంలో పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓట్ల శాతంపై టీఆర్‌ఎస్‌తో, కాంగ్రెస్ పార్టీలు తమకే అనుకూలమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో ఏవరు విజయం సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారంలో ఉంది. దీంతో అప్పట్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. 2014 జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్, వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కేవలం 19వేల మెజార్టీతో విజయం సాధించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గాన్ని వేల కోట్లతో నిధులతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దారు. గజ్వేల్‌లో ఎడ్యూకేషనర్ హాబ్, జిల్లా ఆసుపత్రి, ఓపెన్ ఆడిటోరియం, సమీకృత మార్కెట్‌యార్డు, విశాలమైన రోడ్లతో నగరాన్ని తలపించే విధంగా గజ్వేల్‌ను అభివృద్ధి చేశారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం గజ్వేల్ డెవలఫ్‌మెంట్ అథారిటీ (గడా) ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించారు. నియోజక వర్గంలో ఎర్రవెళ్లి, నర్సంపల్లిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి రాష్ట్రానికే మోడల్‌గా నిలిపారు. నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రోడ్లను విస్తరించి అభివృద్ధి చేశారు. నియోజక వర్గం అభివృద్ధి చేసినప్పటికి ఫౌంహౌజ్‌లో ఉన్న, ప్రగతి భవన్‌లో ఉన్న నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో లేడని సర్వత్రా ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి ఇప్పటికి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డిపై, 2014 ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓటమి చెంది మూడవ సారి బరిలో నిల్చున్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎన్నికల్లో ఓటమి చెందిన నిత్యం నియోజక వర్గం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారించటలో కీలక పాత్ర నిర్వహించారు. ధనిక, బీద, చిన్న, పేద తేడా లేకుండ అందరితో మమేకపై ఉంటారని పేరుంది. ఈ సారి ఎలాగైన విజయం సాధించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి తన అనుచరులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సంపాధించారు. మహాకూటమి పక్షాన ఏఐసీసీ కార్యదర్శి గులాం నబీ ఆజాద్, వి.హన్మంత్‌రావు, స్టార్ క్యాంపెయినర్ నగ్మా, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు ప్రచారం నిర్వహించారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజక వర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో సైతం పాదయాత్ర, ర్యాలీ, ఇంటింటీ ప్రచారాన్ని అధికార పార్టీకి ధీటుగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌లు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కుల సంఘాలతో ఆత్మీయ సమ్మెలనాలను నిర్వహించి ఓటర్లను ఆకర్శించే యత్నం చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజున సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ఎన్నికల సమయానికి అదే ఉద్ధృతిని కొనసాగించంలో కొంత విఫలమయ్యారు. అయినప్పటికి ప్రజల సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని వంటేరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ సర్కార్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పార్టీని గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ శ్రేణులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో పెరిగిన ఓట్ల శాతం తమ పార్టీకే అనుకూలంగా మారిందని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరా సమరంలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. కేసీఆర్ విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతాడా? లేక కేసీఆర్‌పై విజయం సాధించి వంటేరు చరిత్ర సృష్టిస్తారా మరికొన్ని గంటలు ఉత్కంఠ భరితంగా వేచి చూడాల్సిందే.