తెలంగాణ

కూటమిలో హైటెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానుండటంతో ప్రజాకూటమి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్ కంటే ప్రజాకూటమి ఎక్కువ సీట్లు గెలిచే పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి పక్షాలన్నింటినీ కలిపి గవర్నర్ లెక్కలోకి తీసుకుంటారా? లేక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తారా? అనే ఆందోళన కూటమి నేతల్లో నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ స్థానాలు సాధించే పార్టీలను ఆహ్వానించే అంశంలో గవర్నర్ ఆయోమయానికి గురికాకుండా ముందు జాగ్రత్తగా కూటమి నేతలు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు తమ మద్దతు అవసరమైతే కొన్ని షరతులతో మద్దతు ఇస్తామని బీజేపి ప్రకటించడంతో ప్రజాకూటమి నేతల్లో ఆందోళన నెలకొంది.
ఎన్నికలకు ముందు జత కట్టే పార్టీలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణనలోకి తీసుకోవాలంటూ గవర్నర్‌ను కలిసి కూటమి నేతలు కోరడానికి కారణం కూడా ఇదే. కర్నాటక మాదిరిగా తెలంగాణలో హంగ్ ఏర్పడితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ను కాకుండా ఇక్కడ ప్రజాకూటమి తరఫున గెలిచే వారందరిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని వీరు గవర్నర్‌ను కోరారు. ప్రజాకూటమి నేతల మధ్య జరగుతోన్న చర్చల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సొంతంగా 51 స్థానాలు, టీఆర్‌ఎస్ 45 స్థానాలు గెలిచే పక్షంలో ఎంఐఎం మద్దతుతో టీఆర్‌ఎస్ బలం 52 స్థానాలకు చేరుకుంటుంది. కాంగ్రెస్ కంటే ఒక్క స్థానం ఎక్కువ ఉందని టీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంటుందని కూటమి భయపడుతోంది. టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఎంఐఎంతో అధికారికంగా పొత్తు పెట్టుకోకపోవడంతో వారిచ్చే మద్దతును పరిగణనలోకి తీసుకోవద్దన్నది కూటమి నేతల వాదన. అయితే తమకు మద్దతు ఇచ్చే పక్షాలు (టీడీపీ, టీజేసి, సీపీఐ) అలా కాకుండా ఎన్నికలకు ముందే అధికారికంగా పొత్తు కుదుర్చుకోవడంతో ప్రజాకూటమి తరఫున గెలిచే అభ్యర్థులందరిని లెక్కించే పరిగణనలోకి తీసుకోవాలన్నది వీరి వాదన. ఈ అంశంలో ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు, సర్కారీయా కమిషన్ సిఫారసులు ఉన్నాయని కూటమి వాదన. ఎందుకైనా మంచిదని కీడు ఎంచి మేలు ఎంచాలనే గవర్నర్‌ను ముందుగా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించడంలో అనుసరించే అనవాయితీని గుర్తు చేసినట్టు కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా రాష్ట్రంలో హంగ్ ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజాకూటమికి తగినంత బలం లేనిపక్షంలో ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిసారించింది. ప్రజాకూటమికి మద్దతు ఇచ్చేది లేదని ఎంఐఎం ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ కూటమికి మద్దతు ఇవ్వదు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ల మద్దతు అనివార్యం అవుతుంది. పైగా ఇండిపెండెంట్లు ఎంతమంది గెలుస్తారన్నది వేరే అంశం. అయితే ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్లు 8 నుంచి 10 మంది గెలిచే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ సర్వేలో తేలడంతో వారిని తమవైపు తిప్పుకోవాలని కూటమి భావిస్తోంది. గెలిచే అవకాశం ఉన్న ఇండెపెండెంట్లతో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్టు సమాచారం. అవసరాన్ని బట్టి వీరికి పదవులు, డబ్బుతో ఎరవేసినట్టు తెలిసింది. ఫలితాలు వెలువడగానే గెలిచే ఇండిపెండెంట్లను కూటమి శిబిరానికి తీసుకవచ్చే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ప్రజాకూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడ సీట్లు లభించని పక్షంలో అనుసరించే వ్యూహరచనకు కాంగ్రెస్ అధిష్టానం గులాంనబీ ఆజాద్, అహ్మాద్ పటెల్‌ను సోమవారం సాయంత్రమే బెంగళూరుకు చేరుకోనున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
వీరు అక్కడి ఉండి మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను అంచన వేస్తారు. ప్రజాకూటమికి ఫలితాలు అనుకూలంగా ఉండే పక్షంలోనే వీరు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ లోగా సోమవారం సాయంత్రమే కర్నాటక మంత్రి డికె శివకూమార్‌ను అధిష్టానం హైదరాబాద్‌కు పంపించినట్టు తెలిసింది. ఈయన హైదరాబాద్ పర్యటనను పార్టీ గోప్యంగా ఉంచింది. పార్టీ ముఖ్య నేతలు కొందరితో పాటు బెంగళూరులో మకాం వేసిన నేతలకు మాత్రమే డికె శివకుమార్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాల సమాచారం.