రాష్ట్రీయం

ఖమ్మంలో కూటమి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ప్రతిపక్షాల హవానే కొనసాగింది. మొత్తం 10నియోజకవర్గాలకు గాను 8నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా ఒకచోట టీఆర్‌ఎస్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2014ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ కొత్తగూడెం స్థానంలో మాత్రమే గెలుపొందగా సత్తుపల్లిలో టీడీపీ, వైరా, అశ్వారావుపేట, పినపాకలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మిగిలిన స్థానాలన్నీ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. తాజాగా 2018 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, వైరాలో స్వతంత్ర అభ్యర్థి లావూడ్యా రాములునాయక్ విజయం సాధించగా, సత్తుపల్లిలో టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేటలో టీడీపీకే చెందిన మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. పాలేరులో కాంగ్రెస్‌కు చెందిన కందాల ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు చెందిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు(కాంగ్రెస్), భద్రాచలంలో పొడెం వీరయ్య(కాంగ్రెస్), ఇల్లెందులో హరిప్రియనాయక్(కాంగ్రెస్), మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టివిక్రమార్క విజయం సాధించారు. రాష్టమ్రంతా టీఆర్‌ఎస్ గాలి వీచినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం కూటమికి ప్రజలు పట్టం కట్టడం విశేషం. రాష్టమ్రంత్రి హోదాలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం ఈ కూటమి గాలికి ఓటమి చెందారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఖమ్మం స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తాజా మాజీలుగా ఉన్న జలగం వెంకట్రావ్, తుమ్మల నాగేశ్వరరావు, బాణోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్యలు ఓటమి పాలయ్యారు. భద్రాచలం తాజా మాజీ ఎమ్మెల్యే, సీపీఎంకు చెందిన సున్నం రాజయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్టవ్య్రాప్తంగా ప్రాధాన్యత కలిగిన ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఖమ్మం నియోజకవర్గంలో పోటీచేసిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ చేతిలో ఓటమి పాలవ్వగా, పాలేరులో పోటీచేసిన నామా నాగేశ్వరరావు తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మధిరలో పోటీచేసిన కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా మూడవసారి పోటీచేసిన సండ్ర వెంకటవీరయ్య కూడా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం విశేషం. సీపీఎం కంచుకోటగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబురావుకు కేవలం 13,820ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. అలాగే సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీకి కంచుకోటగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా ఆరవసారి పోటీచేసిన గుమ్మడి నర్సయ్యకు 12,831ఓట్లు మాత్రమే వచ్చాయి. గుమ్మడి ఐదుసార్లు విజేతగా నిలిచారు. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన లావూడ్యా రాములునాయక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌పై ఘన విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అత్యధికంగా 19,495ఓట్ల మెజార్టీ రాగా అత్యల్పంగా ఇల్లెందు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియకు 2,650ఓట్ల మెజార్టీ లభించింది. ఖమ్మంలో టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితం రాలేదు. అలాగే జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు నియోజకవర్గాల్లో కెసిఆర్ పర్యటించినప్పటికీ ఓటమి పాలయ్యారు.