తెలంగాణ

హామీల అమలుకు కేసీఆర్‌పై వత్తిడి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రానున్న రోజుల్లో కేసీఆర్ హామీలను అమలు చేసే విధంగా వత్తిడి తీసుకువస్తామని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వెల్లడించారు. టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవనంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాఫ్రంట్ మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం చెందామన్నారు. ప్రజాఫ్రంట్ నేతలు త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తారని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ ఉత్సాహంగా పని చేస్తుందని చెప్పారు. పథకం ప్రకారం ముందస్తు ఎన్నికలను తీసుకొచ్చి కేసీఆర్ లబ్ధి పొందారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే రాజకీయ లబ్ధిపొందాలని ఊహించిన కేసీఆర్‌కు సాధ్యపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని, టీడీపీకి 0.2 ఓటు శాతం ఉందని ముందస్తు ఎన్నికలు చేపడితే ప్రతిపక్షాలను దెబ్బతీయవచ్చునని ఊహించిన కేసీఆర్ భావించారని రమణ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కోసం కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి పనిచేశాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కొలుదీరాయని చెప్పారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్న అధికార పక్షం దూకుడును కొంతమేర అడ్డుకున్నామని చెప్పారు. ప్రజాఫ్రంట్ అభ్యర్థుల కోసం టీడీపీ కార్యకర్తలు విరోచితంగా పని చేశారన్నారు. గెలుపు ఓటములు సహజమని ఇది టీడీపీకి కొత్తకాదన్నారు. ప్రజాఫ్రంట్‌కు మద్దతు ప్రకటించిన అన్ని వర్గాలకు, ఓటర్లకు రమణ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు బి శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి, అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అజ్మీర రాజునాయక్, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎండి యూసఫ్ పాల్గొన్నారు.