తెలంగాణ

గవర్నర్‌కు నివేదిక అందించిన సీఈఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ బుధవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు అందించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సత్యేంద్ర కుమార్ రుడోలతో కలిసి రజత్ కుమార్ బుధవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్ వెళ్లారు. 119 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నివేదికను గవర్నర్‌కు అందించారు. ఈ నివేదిక ఆధారంగా కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ బుధవారమే తెలంగాణ రాజపత్రం (తెలంగాణ గెజిట్) ను ప్రకటించారు. ఈ గెజిట్‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మంది పేర్లు, వారు ఏ పార్టీ తరఫున విజయం సాధించారో వివరించారు.

చిత్రం..గవర్నర్ నరసింహన్‌కు నివేదిక అందిస్తున్న సీఈవో రజత్‌కుమార్