తెలంగాణ

ఓటర్ల జాబితాలో పేరు లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ‘‘ఓటర్ల జాబితాలో మీ పేరు లేదా..అయితే ఈ నెల 26 తర్వాత మీ పేరు నమోదు చేసుకోండి’’ అంటూ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. సచివాలయంలో బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణను మళ్లీ చేపడుతున్నామన్నారు. ఈ సవరణ ప్రణాళిక ఈ నెల 26 న ప్రారంభమవుతుందని, 2019 ఫిబ్రవరి 12 వరకు పూర్తి చేస్తామన్నారు. వాస్తవంగా ఏటా జనవరి 1 వరకు ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ తరఫున జారీ చేసిన తాజా ఓటర్ల జాబితాను పరిశీలించి, ఎవరైనా తమ పేర్లు లేవని గుర్తిస్తే వెంటనే తమ పేర్లను జాబితాలో చేర్చేందుకు దరఖాస్తు చేయవచ్చన్నారు. 2019 జనవరి 1 కి కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించామని, 2018 డిసెంబర్ 31 వరకు 18 సంవత్సరాలు నిండినవారు ఓటర్‌గా తమ పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని రజత్ కుమార్ తెలిపారు. 2018 నవంబర్‌లో జారీ చేసిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. ఈ జాబితాను పరిశీలించి, పేర్లు లేనివారు వెంటనే తమ పేరు జాబితాలో చేర్చేందుకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఇందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించామని గుర్తు చేశారు.
2018 నవంబర్‌లో జారీ చేసిన ఓటర్ల జాబితాలో 22 లక్షల పేర్లు గల్లంతయ్యాయంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేశారన్నారు. నిజంగానే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయి ఉంటే శాంతి, భద్రతల సమస్య తలెత్తేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగిన ఓట్ల సవరణ సందర్భంగా మూడు నాలుగు పర్యాయాలు అఖిలపక్షం సమావేశాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఎవరైనా ఇల్లు మారిఉంటే, వారికి నోటీసు ఇచ్చామని, ఏడు రోజుల పాటు వేచి చూసి వారిపేర్లు తొలగించామన్నారు. ఇల్లు మారిన తర్వాత కూడా వారి పేర్లు కొనసాగితే ఆ పేర్లతో ఇతరులు దొంగఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మళ్లీ సవరణ
ఇప్పుడు మళ్లీ కొత్తగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించాలని, ఈ నెల 26 న జారీ చేసే ఓటర్ల జాబితా పరిశీలించి, పేర్లు లేకపోతే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రూపొందించే ఓటర్ల జాబితా పార్లమెంట్ ఎన్నికలకు ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ షెడ్యూల్
2018 డిసెంబర్ 26 నుండి 2019 జనవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రజత్ కుమార్ తెలిపారు. 2019 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల పరిశీలన చేసి అన్ని వివరాలు సక్రమంగా ఉన్న వారి పేర్లను జాబితాలో చేరుస్తామన్నారు. 2019 ఫిబ్రవరి 18 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. దీన్ని పరిశీలించిన తర్వాత ఇంకా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, 2019 ఫిబ్రవరి 22 న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వివరించారు.