తెలంగాణ

ఎందుకిలా జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున మోహరించి స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించినా అనూహ్య పరాజయం పాలవ్వడంపై పార్టీలో అంతర్మధనం మొదలైంది. ఎందుకిలా జరిగిందంటూ పార్టీ నేతలు విచారణ చేస్తున్నారు. చాలా మంది హేమాహేమీలు అనుకున్న వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. బాబూమోహన్‌కు 2404 ఓట్లు మాత్రమే రావడం కూడా అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేసింది. 118 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు పోటీ చేయగా, ఒక స్థానంలో జిట్టా బాలకృష్ణారెడ్డికి మద్దతు పలికింది. ఎన్నికల ఫలితాల్లో ఒకే ఒకస్థానాన్ని గోషామహల్ అభ్యర్ధి రాజాసింగ్ దక్కించుకోగా, బీజేపీ అభ్యర్ధులు 11 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆదిలాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కల్వకుర్తి, కరీంనగర్, కార్వాన్, ఖైరతాబాద్, ముథోల్, మల్కాజ్‌గిరి, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు ఓట్ల సాధనలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. 51 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలవగా, 30 నియోజకవర్గాల్లో నాలుగో స్థానంలోనూ, 16 నియోజకవర్గాల్లో ఐదో స్థానంలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరో స్థానంలో , ఒక నియోజకవర్గంలో ఏడో స్థానంలో ఒక నియోజకవర్గంలో తొమ్మిదో స్థానంలో బీజేపీ అభ్యర్ధులు నిలిచారు. వెయ్యిలోపు ఓట్లు డోర్నకల్‌లో లభించగా మిగిలిన 117 నియోజకవర్గాల్లోనూ వెయ్యికి పైగానే బీజేపీ అభ్యర్ధులు సాధించారు. నాలుగో స్థానంలో నిలిచినా, భూపాలపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, నాంపల్లి, మక్తల్, యాకుత్‌పురల్లో 10వేలకు మించి ఓట్లు సాధించారు. భూపాలపల్లి అభ్యర్ధికి 15744 ఓట్లు రాగా, కూకట్‌పల్లి అభ్యర్ధికి 11943, రాజేంద్రనగర్‌లో 19627, నాంపల్లిలో 11622, మక్తల్‌లో 20242, యాకుత్‌పురలో 16608 ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఇక మూడోస్థానంలో ఉప్పల్ ప్రభాకర్‌కు 26,798 ఓట్లు రాగా, భువనగిరిలో 13427, దుబ్బాకలో 22595, ఖానాపూర్‌లో 23779, కొల్హాపూర్‌లో 13154, కోరట్ల 16046, ఎల్బీనగర్‌లో 21502, జహీరాబాద్‌లో 19454, తాండూరులో 10548, సిద్దిపేటలో 11266, కంటోనె్మంట్‌లో 15484, సనత్‌నగర్‌లో 14247, నిజామాబాద్‌లో 24192, నిర్మల్ 16900, నారాయణ్‌పేటలో 20111, నారాయణ్‌ఖేడ్‌లో 33060, ముషీరాబాద్‌లో 30,813, మునుగోడులో 12,725, మలక్‌పేటలో 20880, మహబూబాబాద్‌లో 11646 ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఇక ఆదిలాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణ్ గుట్ట, చార్మినార్, కల్వకుర్తి, కరీంనగర్, కార్వాన్, ఖైరతాబాద్, ముథోల్, మల్కాజ్‌గిరి, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కరీంనగర్‌లో 66009, అంబర్‌పేటలో 60542 ఓట్లు బీజేపీకి రాగా, ఆదిలాబాద్‌లో 47,444, చాంద్రాయణగుట్టలో 15075, చార్మినార్‌లో 21222, కల్వకుర్తిలో 59,445, ఖైరతాబాద్‌లో 34,666, ముథోల్‌లో 40,602, మహేశ్వరంలో 39,445 ఓట్లు బీజేపీకి దక్కాయి. కొంత మంది మాజీలకు కనీస ఓట్లు కూడా రాకపోవడంపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా వారి పనితీరులో లోపం కూడా దీనికి కారణమని వారు చెబుతున్నారు.