తెలంగాణ

అశల పల్లకీలో ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 12: అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపైన పడింది. సీఎంగా కేసీఆర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో ఆయనతోపాటు ఒక్కరు లేదా ఆరడజన్ పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉండడంతో మొదటి విడత మంత్రి వర్గ కూర్పులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎవ్వరికి దక్కుతుందోనన్న టెన్షన్ , ఉత్కంఠం ఆశావాహుల్లో నెలకొంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి పదవులు కేటాయించడంలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన స్పీకర్ పదవితోపాటు డీప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ పదవి ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి చందులాల్ ఇద్దరు కూడా ఓటమి చెందగా డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే వారిద్దరి స్దానంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో పాటు కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తారన్నా ఉహగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయన్న అంచనాలతో ఇప్పటికే మంత్రి పదవులు అశిస్తున్న పలువురి ఎమ్మెల్యేలు వారి గాడ్‌ఫాధర్ల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తునట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఎకైక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటు వచ్చాడనే పేరుంది. అంతే కాక టీఆర్‌ఎస్ నుండే మూడు సార్లు హాట్రిక్ విజయంతో పాటు ఉప ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అంతే కాకుండా మంత్రి కేటీ ఆర్‌తో దాస్యం వినయ్‌భాస్కర్‌కు మంచి సంబందాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి రావాల్సి ఉండగా అనేక సమీకరణాల కారణంగా దక్కలేదు. ఈ సారి మాత్రం మంత్రి పదవి ఖాయంగా దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. కడియం శ్రీహరికి డిప్యూటీ సీ ఎం పదవి కొనసాగే అవకాశం ఉన్నాయి. ఒక వేళ కడియం సేవలు పార్టీకే అవసరం అనుకోవడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ భావిస్తే మంత్రి పదవి దక్కక పోవచ్చనే వాదనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఇక గిరిజన సంక్షేమ మంత్రిగా గత మంత్రి వర్గ కూర్పులో పనిచేసిన ఆజ్మీర చందులాల్ ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఒటమి పాలుకావడంతో ఆ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రెడ్యానాయక్ 2014లో కాంగ్రెస్ నుండి ఎకైక ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. రెడ్యా నాయక్‌తో పాటు ఆయన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత కూడా టీఆర్‌ఎస్ చేరినప్పటికి ఇప్పటి వరకు ఎలాంటి పదవి వారికి దక్కలేదు. ఈ సారి రెడ్యా నాయక్‌కు గిరిజన సంక్షేమ మంత్రి పదవి ఖాయంగా చెపుతున్నారు. అదే విధంగా పాలకుర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నారు.
2014 ఎన్నికల్లో పాలకుర్తి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉంటునే పార్టీని మొత్తాన్ని టీఆర్‌ఎస్‌లో వీలినం చేస్తూ ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పుడే దయాకర్‌రావుకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ఆయనకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది.