తెలంగాణ

సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం ముగిసాక పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఓటమి పాలుకావడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా, గెలుపు, ఓటములు రాజకీయాల్లో సహజమని, బాధపడవద్దని మీ రాజకీయ భవిష్యత్ తనకు వదిలేయమని సీఎం కేసీఆర్ ఓదార్చారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, హాస్యనటుడు ఆలీ తదితరులు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.