తెలంగాణ

కేసీఆర్‌కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కేసీఆర్‌కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారమని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు కూడా ఇదే చివరి ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తుంటే ఆయన ఏ మాత్రం మారలేదనే విషయం అర్ధమవుతోందని అన్నారు. తాడు బొంగరం లేని కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఏ పార్టీలూ విశ్వసించవని చెప్పారు. మజ్లిస్‌ను పట్టుకుని ఊరేగుదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లిస్‌ను జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయని కేసీఆర్ నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. దేశానికి ఒక సుప్రీంకోర్టు లేకపోక, రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు.