తెలంగాణ

ఓడినా తిరిగి పైకి లేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదని, భవిష్యత్‌లో తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీపీసీసీ ప్రచార కమిటి చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోవడం కాస్త బాధగా ఉన్నప్పటికీ తిరిగి తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వసుందన్నారు. గాంధీభవన్‌లో గురువారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తమ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాము ఇలాంటి అనుభవాలు ఎదురైనా తిరిగి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. పార్టీ శ్రేణులు ఓటిమికి కుంగిపోకుండా పార్టీని బలోపేతానికి కృషి చేయాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికల్లో ఓటమికిగల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రచారానికి చంద్రబాబు రావడం వల్లనే కాంగ్రెస్ పరాజయం పాలైందని జరుగుతోన్న ప్రచారంపై ఇప్పుడే తాము ఒక అభిప్రాయానికి రాలేమన్నారు. ఫలితాలపై లోతుగా అధ్యయనం చేసాకే తాము స్పందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అధికారం శాశ్వతమని టీఆర్‌ఎస్ అనుకోవద్దని హితవు పలికారు. అలా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొటి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలను బయటికి తీస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినంత మాత్రాన తాము భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు తమతో టచ్‌లో ఉన్నట్టు కేసీఆర్ చెప్పడాన్ని భట్టి ఖండించారు.
గెలిచిన వారిలో ఎవరు అలాంటి వాళ్లు లేరన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.

చిత్రం..గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క