తెలంగాణ

కేంద్రంతో తాడోపేడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కేంద్రంతో ఇక తాడోపెడో తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్లమెంట్ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు. విభజన హామీలు, కాళేశ్వరానికి జాతీయ హోదా, సచివాలయానికి బైసన్ పోలో మైదానం కేటాయింపు, కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన డిమాండ్లపై పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక ప్రగతి భవన్‌లో గురువారం సాయంత్రం పార్లమెంట్, రాజ్యసభ సభ్యులతో తొలి సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహంపై ఎంపీలతో సీఎం చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్‌లో పార్టీ నాయకుడు జితేందర్‌రెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎయిమ్స్‌తో సహా కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో మైదానం కేటాయింపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని నిలదీయాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై కేంద్రానికి ఇప్పటికే తానే స్వయంగా 33 సార్లు ఆర్జీలు సమర్పించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వీటికి సంబంధించి కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలకు మరోసారి వినతి పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. వీటిలో ప్రధానంగా రిజర్వేషన్ల పెంపు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పట్టుబట్టాలని సూచించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు జనవరి 1 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎంకు కేటాయించే సీటు మినహాయించి మిగతా 16 సీట్లను టీఆర్‌ఎస్సే కైవసం చేసుకోవాలన్నారు. దీని కోసం ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో ఎంపీలు దృష్టి సారించి గట్టిగా పని చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేయాలన్నారు.