తెలంగాణ

చంద్రబాబును నిందించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమిగల కారణాలపై పోస్టుమార్టం మొదలు పెట్టింది. కారణాలను విశే్లషించి పార్టీ అధిష్టానికి నివేదించడానికి కసరత్తు చేస్తోంది. పార్టీ ఓటమి తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సీనియర్ నేతలు కె జానారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తదితరులు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని ఓట్ల రూపంలో పొందలేక పోవడంలో వైఫల్యానికి కారణం ఏమిటన్న కోణంలో విశే్లషించారు. ప్రజామెప్పు పొందగలిగినా ఓటమికి ఈవీఎంలే కారణమన్న అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేశారు. అయితే ఈవీఎంల ట్యాపరింగ్‌పై సాంకేతిక నిపుణులతో చర్చించి నిర్థారించుకున్నాకే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాకూటమి పరాజయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కారణమని అక్కడక్కడ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో రాజకీయ పార్టీల సమీకరణలో కీలక భూమిక పోషిస్తోన్న చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు ఇక నుంచి పార్టీ నేతలు ఎవరూ చేయవద్దని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఇలా ఉండగా సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ, 22 లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్ నిర్ధాక్షిణ్యంగా తొలగించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఓట్ల తొలగింపు అంశం కోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం తప్పన్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌తో పాటు మిగతా అధికారులు టీఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈవీఎం చిప్‌లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించాక ఎన్నికల కమిషన్ బండారాన్ని బయట పెడతామని హెచ్చరించారు. బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ పేపర్ ఉద్యమానికి హైదరాబాద్ నుంచే శ్రీకారం చుడతామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను తాము మిషన్ మాండేటరీగానే చూస్తాం తప్ప పీపుల్స్ మాండేటరిగా చూడటం లేదని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ విమర్శించారు. సగం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు అడ్డుకోగా వారు ఎలా విజయం సాధించగలిగారని వారు ప్రశ్నించారు.