తెలంగాణ

మిస్టర్ ఫర్‌ఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కేటీఆర్ నియామకాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉండటంతో పార్టీ బాధ్యతలను నమ్మకస్తుడు, సమర్ధుడికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తు.చ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌పై అచంచల విశ్వాసం ఉందని, రాష్ట్ర భవిష్యత్ కోసం పార్టీని అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలకు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఏ బాధ్యతను అప్పగించినా విజయవంతంగా నిర్వహించడంతో పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలా ఉండగా కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన సమాచారం తెలియగానే పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు బేగంపేట క్యాంప్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చి అభినందనల్లో ముంచెత్తారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మరింతగా కృషి చేస్తానని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇలా ఉండగా తనకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని పార్టీ సీనియర్ నాయకుల నివాసాలకు కేటీఆర్ స్వయంగా వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, సిద్దిపేట ఎమ్మెల్యే టీ. హరీశ్‌రావు, నాయిని నరసింహారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ఇళ్లకు ఆయన వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్ సముచిత నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశంసిస్తూ కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం తర్వాత తెలంగాణ భవన్‌లో సాయంత్రం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వచ్చిన కేటీఆర్‌కు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి, పూలవర్షం కురిపించి, పుష్పగుచ్ఛాలు అందజేసిన పార్టీ నేతలు కేటీఆర్‌ను అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.