తెలంగాణ

తండ్రికి తగ్గ తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: నాయకుడంటే మాటలు చెప్పేవాడు కాదు. శుష్కవాగ్దానాలతో జనాన్ని మభ్యపెట్టేవాడు అంతకంటే కాదు. నిన్నటి రాజకీయం వేరు. నవతరం ఆశిస్తున్న ప్రజానాయకత్వం వేరు. నాయకత్వానికి విజ్ఞత, దూరదృష్టి తోడైతే.. దానికి సమర్థత సానపెడితే ఇక ఎదురేముంటుంది. ఎంతటి బృహత్కార్యమైనా కరతలామలకమే..ఎంతటి సవాలైనా తృణప్రాయమే.అన్నింటా తానై.. అన్నీ తానై రాణించే నాయకులు అరుదుగా ఉంటారు. తొలి తెలంగాణ సర్కార్‌లో మంత్రిగా తన పటిమ ఏమిటో జగద్విదితం చేసుకున్న కల్వకుంట్ల తారకరామారావు రెండోసారీ పార్టీకి అనూహ్య విజయం చేకూర్చడంలో అద్వితీయ భూమికే పోషించారు.
విపక్షాలు జతకట్టినా.. ఆయన ధీమా చెక్కుచెదరలేదు. జనంతో జతకట్టిన సంక్షేమ పాలన తమదంటూ విపక్షాల్ని నివ్వెరపరిచి కారును విజయవిహారం చేయించారు. బాధ్యత ముందు ఆయనకు ఎదీ భారం కాదు. పట్టుదలకు మించిన ఆయుధం మరొకటి లేదు. భాగ్యనగరం కొత్త సొబగుల్ని సంతరించుకున్నా..ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారినా.. దాని వెనుక ఉన్నది కేటీఆర్. ఆ మూడక్షరాల్లోనే కమిట్‌మెంట్..టీమ్‌వార్క్, రేషనాలిటీ ఇమిడి ఉన్నాయి. అందుకే కేటీఆర్‌ను మిస్టర్ పర్‌ఫెక్ట్ అనడం అతిశయోక్తి కాదు. ఆయన దక్షతకు దర్పణం పట్టడమే.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే ‘రాజకీయ సన్యాసానికైనా నేను రెడీ, మరి మీరు రెడీనా?’ అని రాజకీయ ప్రత్యర్థులకు గిరిగీసి సవాల్‌కు విసరగలిగిన ధైర్యశాలి, మరోరకంగా తండ్రి మాదిరగానే మొండిఘటం కూడా. అవీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికల్లోనైనా పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్నీ తానై ఒకే ఒకడుగా అహోరాత్రులు శ్రమించిన పట్టుదల ఆయనది. రాజకీయ నాయకునిగానే కాకుండా ప్రపంచ పారిశ్రామిక సదస్సు విజయవంతంగా నిర్వహించి అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ప్రశంసలు అందుకోగలిగిన గొప్ప తెలివి తేటలు ఆయన సొంతం. ప్రపంచ పారిశ్రామిక రంగ దిగ్గజాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా కేటీఆర్ శెభాష్ అని అభినందనలు అందుకోగలిగారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్ల పాటు పాలించి అశేష ప్రజానీకం అభిమానాన్ని చూరగొనడానికి కేసీఆర్‌కు రెండు దశాబ్దాలు పట్టింది. అయితే దశాబ్ద కాలంలోనే తన తెలివి తేటలతో సమర్థతతో, పరిణతితో, కార్యదక్షతతో ప్రపంచానికి కేటీఆర్‌గా చిరపరచితుడయ్యారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టి ఐటీ రంగ దిగ్గజాలను సైతం మెప్పించారు. ఈ ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో గుప్పుమన్న అసమ్మతీయులను బుజ్జగించి, హామీలిచ్చి దారికి తీసుకరావడానికి ఎంతో శ్రమించి పార్టీకి కనీవినీ ఎరగని రీతిలో అఖండ విజయాన్ని చేకూర్చడంలో కేటీఆర్ సఫలీకృతమయ్యారు. ఈయన శ్రమ, పట్టుదల, కార్యదక్షతను గుర్తించి పార్టీని మరింత బలోపేతం చేసే గురుతర బాధ్యతను కేటీఆర్‌పై పార్టీ అధినేత కేసీఆర్ మోపారు.