తెలంగాణ

యాదాద్రిలో ఘనంగా గడప పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, డిసెంబర్ 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా గర్భాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన గడపకు శుక్రవారం గడప పూజ నిర్వహించారు. మరోవైపు త్వరలో స్వామివారి గర్భాలయానికి బిగించే టేకు ద్వారం పనులను పరిశీలించి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అర్చక బృందం సభ్యులు పాల్గొన్నారు.

కేసీఆర్ పీఎం అయితే.. కేటీఆర్ సీఎం
మాజీ మంత్రి జోగు రామన్న జోస్యం

ఆదిలాబాద్, డిసెంబర్ 14: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొన్నామని.. భవిష్యత్తులో కేసీఆర్ ప్రధానమంత్రి అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉంటారని మాజీ మంత్రి జోగురామన్న జ్యోస్యం చెప్పారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఫారెస్ట్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రధాన మంత్రి కేసీఆర్ కావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ సాధించిపెట్టిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం పట్ల అభినందిస్తూ పార్టీ భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవాల్సి ఉండడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మరోసారి మంత్రి పదవి వరిస్తుందా? అన్న విలేకర్ల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, మంత్రి పదవి వస్తే సంతోషిస్తానని, సీఎం నిర్ణయం మేరకు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

నేటి నుంచి హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన

హైదరాబాద్, డిసెంబర్ 14: దేశంలోనే ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన శనివారం నాడు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పుస్తక ప్రదర్శనను ప్రారంభించనున్నారని పుస్తక ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్, కార్యదర్శి కే చంద్రమోహన్, కోశాధికారి పి రాజేశ్వరరావులు చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని, ఈ సందర్భంగా ప్రతి రోజు సభలు, సమావేశాలు, సాహిత్య సమాలోచనలు, పుస్తకా విష్కరణ, పిల్లల కోసం బాలల వికాస్ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి ప్రాంగణానికి కపిలవాయి లింగమూర్తి ప్రాంగణంగా పిలవనున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనను దాదాపు 10 లక్షల మంది సందర్శిస్తుంటారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 500 స్టాల్స్‌వరకూ ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నామని వారు తెలిపారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వారు వివరించారు.