తెలంగాణ

మంచిరెడ్డి ప్రమాణ స్వీకారం ఆపండి * ఈసీకి మల్‌రెడ్డి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఆపాలని, ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసీని కోరారు. ఈ మేరకు శుక్రవారం మల్‌రెడ్డి ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఎన్నికల అధికారులు కేటీఆర్ ఆదేశాల మేరకు పని చేశారని ఆయన ఆరోపించారు. 18వ రౌండు నుంచి తన మెజార్టీని క్రమంగా తగ్గించారని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. టీఆర్‌ఎస్, బీఎస్‌పీ మధ్య కేవలం 376 ఓట్లు తేడా వచ్చిందని ఆయన అన్నారు.
త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల లిస్టులో తప్పులను సరిదిద్దాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలంగాణ ఎన్నికల అధికారి నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల లిస్టులో భారీగా ఓట్లు గల్లంతుయ్యాయని ఆయన గుర్తు చేశారు.