తెలంగాణ

పోషకాహార లోపాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: పోషకాహార సంస్థలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.హైదరాబాద్‌లో శుక్రవారం నాడు జరిగిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వందేళ్ల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనారోగ్యాల నుండి ప్రజలను కాపాడేందుకు పోషకాహారం విషయంలో సరికొత్త వ్యూహాలను అనుసరించాలని అన్నారు. ఇదే సమయంలో వ్యవసాయంలో పురుగు మందుల వాడకం వంటి సవాళ్లు విసురుతున్నాయని, రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు మెరుగైన ప్రకృతి వ్యవసాయ దిశగా దృష్టిపెట్టాలని అన్నారు. 1918లో ఒక చిన్న ల్యాబ్‌గా ప్రారంభంమైన ఒక సంకల్పం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ రూపంలో భారతదేశ ప్రధాన పౌష్టికాహార సంస్థగా అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిందని , వందేళ్లచరిత్రలో పోషకాహార శాస్త్రం, ప్రజారోగ్యం విషయంలో ఈ సంస్థ గణనీయమైన కృషి చేసిందని ప్రశంసించారు. ప్రస్తుతం ఆకలి సమస్య కంటే కూడా పోషకాహార లోపం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అన్ని వయస్సుల వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాహార విషయంలో సంస్థ చేస్తున్న పరిశోధనలు కీలకమైనవని ఉప రాష్టప్రతి తెలిపారు. ఐరన్‌లోపం, రక్తహీనత, విటమిన్ లోపం , అయోడిన్ లోపం వంటి సమస్యల నివారణ కోసం నిన్ చేస్తున్న కృషి చాలా గొప్పదని అన్నారు. అయోడిన్ లోపం, ఐరన్ లోపం సమస్యల నివారణ కోసం ఈ సంస్థ రూపొందించిన డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ సాంకేతిక పరిజ్ఞానం అనేక పోషకాహార కార్యక్రమాల్లో కీలకపాత్ర వహిస్తోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్ర్తియమైన ప్రామాణిక పోషకాహార సమచారానికి చాలా డిమాండ్ ఉందని, 1930లో తొలి డేటాబేస్ విడుదల చేసి ఎప్పటికపుడు పరిస్థితులకు అనుగుణంగా సమాచారాన్ని నవీకరించడం , వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పోషకాహార కార్యక్రమాల్లో సహకారం అందించడం ఆనందదాయకమని అన్నారు. ఓ సంస్థ వంద సంవత్సరాల మైలు రాయి దాటడం చాలా గొప్ప విషయమని, పోషకాహారం విషయంలో అనేక సమస్యలున్న భారత్‌లో ఈ సంస్థ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. అదే సమయంలో దేశంలో పోషకాహార పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతలను పున:పరిశీలించాలని పోషకాహారలోపం, సూక్ష్మ పోషక లోపాలు వంటి సమస్యల దిశగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
పట్టణీకరణ ప్రభావం, జీవన శైలిలో వస్తున్న మార్పుల పట్ల సరికొత్త సమస్యలు పుట్టుకువస్తున్నాయని , మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అంటువ్యాధుల్లా వ్యాపిస్తున్నాయని ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు సరికొత్త వ్యూహాలు అనుసరించడానికి ఇదే సరైన సమయమని ఉపరాష్టప్రతి అన్నారు. 2030 నాటికి సమాచారలోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. యుఎన్‌డీపీ ప్రకారం, తగినంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రత్యేకించి పిల్లలకు అందేలా ఎస్‌డీజీ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అన్నారు. ఇదే సమయంలో ఆసియాలో ధృడమైన వ్యవసాయ పద్ధతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయంలో పురుగు మందులు వాడకాన్ని పరిమితం చేయాలని, రైతులు ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని అన్నారు. వ్యవసాయ పరిశోధనా సంస్థలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ కలిసి పనిచేయాలని , ప్రతి ప్రాంతానికి సరిపోయే ఆహార పంటలను ప్రోత్సహించేందుకు ఆరోగ్య సమస్యలకు ఆస్కారం లేని ఆహారం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా నిన్ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించిన డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు, సిబ్బంది సేవలు ఘననీయమని అన్నారు.