తెలంగాణ

మెరిసిన ‘సిరిసిల్ల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 14: టీఆర్‌ఎస్ అఖండ విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై మళ్లీ సిరిసిల్ల పేరు మెరిసింది. ఇప్పటికే ఇక్కడ మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల తారకరమారావు రాష్ట్రంలో సిరిసిల్లకు మంచి గుర్తింపు తేగా, తాజాగా శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కావడంతో మరోసారి సిరిసిల్ల పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం దక్కించుకుంది. ఇందుకు కేటీ.రామారావు సిరిసిల్ల నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించడమే కారణం. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాలు చుట్టుముట్టి అభ్యర్థులను గెలిపించుకోవడంలో సఫలీకృత్యులయ్యారు. అలాగే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖల మంత్రిగా ఈ రంగాలన్నింటిలో తన పాత్రను కీలకంగా పోషించి వనె్న తెచ్చారు. ఐటీ రంగం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది, పలు కంపెనీలు తరలి రావడంతో కృషి చేశారు. పరిశ్రమ శాఖ మంత్రిగా ఈ రంగం అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు సులభ రీతిలో అనుమతిలిచ్చి పరిశ్రమల స్థాపనకు కారకులయ్యారు. అలాగే చేనేత శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి, ఈ రంగంలో కొనసాగుతున్న కార్మికుల ఆత్మహత్యలను నియంత్రించడంతో సఫలీకృత్యులయ్యారు. ఉపాది కరువై ఆకలి చావులు, ఆత్మహత్యల బారిన పడిన సిరిసిల్లను మళ్ళీ ఆత్మహత్యల ఖిల్లా నుంచి సిరుల సిల్లగా సిరిసిల్లను మార్చారు. ఇందు కోసం పవర్‌లూం కార్మికులకు రూ.15 నుండి 20 వేల వరకు వేతనాలు పెంచడానికి నిరంతర ఉపాధి కల్పించారు. నిరంతర ఉపాధి కోసం ఆర్‌వీఎం తదితర ప్రభుత్వ గుడ్డల ఆర్డర్లు, బతుకమ్మ చీరల పథకంను చేపట్టి ఈ రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు.
ఇక రాజకీయంగా అన్నీ తానై పార్టీలో కీలక భూమిక పోషిస్తూ ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తాను జోక్యం చేసుకుని చక్కదిద్దారు. ఇటీవల ఎన్నికల్లో అనేక మంది అసంతృప్తులను సైతం బుజ్జగించి సంతృప్తి పరిచి, విజయాలు చేకూర్చిపెట్టడంలో విజయం సాధించారు. ఇదే రీతిలో పలువురు తెరాస అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా తన వంతు పాత్రను నిర్వహించారు. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక కావడంతో సిరిసిల్ల శాసన సభ్యుడిగా ఈ ప్రాంతానికి మరో సారి కేటీఆర్ వనె్న తెచ్చారు.