తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 14: రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు అఖండ మెజార్టీతో గెలపిస్తారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని హంగ్ ఏర్పడబోతున్నదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యభూమిక పోషిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయిలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నికల పర్యటనలో భాగంగా సోనియా గాంధీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ప్రకటించడాన్ని ఎంపీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్న సోయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల పన్నురాయితీలు కల్పించడంతో పరిశ్రమలు, ఐటీ సంస్థలు తెలంగాణకు పెట్టుబడులు రావని పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావల్సిన హక్కులపట్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఎయిమ్స్ ఆధ్వర్యంలోనే ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష
రాష్ట్ర ఎంపీల పోరాటంతో సాధించుకున్న ఎయిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలోనే ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లుగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.
ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షకు విడుదలైన నోటిఫికేషన్ వివరాలను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన ఆమోదం పొందిన ఎయిమ్స్ సంస్థ పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగుతాయాన్నారు. ఈసమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, టీఆర్‌ఎస్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, గోమారి సుధాకర్‌రెడ్డి, బర్రె మహాలక్ష్మి, ఎడ్ల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.