రాష్ట్రీయం

.ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 14: దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ శుక్రవారం నల్లగొండ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా స్టేషన్ ఆవరణలో 5లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా స్టేషన్ పరిసరాలను, ప్రయాణికులకు అందిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అదేవిధంగా వేగంగా వెళ్లేందుకు విద్యుద్దీకరణ లైన్లు పూర్తయ్యాయని తెలిపారు. నల్లగొండ నుండి మాచర్ల వరకు రైల్వే లైన్ సర్వే పూర్తయిందని, రూ. 480కోట్లతో పనులకు ప్రతిపాదనలు పంపామన్నారు. తిప్పర్తి, చిట్యాల, మండపాడు, వలిగొండ తదితర స్టేషన్లలో హైలెవల్ ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.