తెలంగాణ

18నుండి యాదాద్రిలో అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, డిసెంబర్ 16: యాదాద్రి లక్ష్మీనరసంహస్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఈనెల 18నుండి 23వరకు ఆరురోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. వైష్ణవ సాంప్రదాయ దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అధ్యయనోత్సవాలు కూడా అంతే ప్రాధాన్యత వహిస్తాయి. ఆధ్యయనోత్సవాలు జరుగని ఆలయాల్లో తీర్ధప్రసాదాలు తీసుకోరాదని, పరమ పదోత్సవం జరగనిదే బ్రహ్మోత్సవం చేయరాదని పాంఛరాత్రగమశాస్త్రం చెబుతుంది. ముక్కోటి ఏకాదశి నుండి అధ్యయనోత్సవాలు మొదలవుతాయి. ఆలయాల్లో అధ్యయనోత్సవాలు నిర్వాహణ సామర్ధ్యం అనుసరించి ఒకటి, మూడు, ఐదు, ఆరు, పదకొండ, పదహారు రోజులుగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పలు ఆలయాల్లో ఒక్క నమ్మళ్వార్ రఛించిన తిరువాయిమెడి మాత్రమే పారాయణ చేస్తారు. యాదాద్రిలో తిరువాయిమేడితో పాటు పనె్నండు మంది అళ్వార్లు రఛించిన నాలుగు వేదములకు సమానమైన నీలాయిఠాలను అనుసంధానం చేస్తారు. పనె్నండు మంది అళ్వార్ల భక్తి ఆవేశంతో పొంగినప్పడు వారి నుండి జాలువారిన పాటలే పాశరములై దక్షిణదేశ మోక్ష ప్రాప్త తారకమంత్రములైనాయి. సంస్కృత వేదములను వేద మహర్షి పూజించి నాలుగు భాగములు చేసినట్లే నాదమునులు ద్రవిద వేదమును నాలుగు భాగములుగా విభజించారు. వాటిలో మదలాయిరం, ఇయర్పా, పెరియలూరుముడి, తిరువాయిమేడిలున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో వేదములకు ప్రావిణ్యులైన తమిళ వేద పండితులచే పారాయణం చేయిస్తారు. ఆరు రోజులలో అళ్వార్లు రఛనల మేరకు వచ్చే అవతారాన్ని అనుసరించి సదరు అవతారంలో లక్ష్మినరసింహస్వామివారికి అలంకారం చేసి పుర వీధుల్లో ఊరేగిస్తారు. ఉత్సవాల్లో చివరి రోజు 22వ తేదిన సాయంకాలం పరమ పదోత్సవం జరుగుతుంది. వందమైళ్ల దూరమైనపోయి పరమ పదోత్సవం చూడాలని సామేత. అళ్వారులలో ప్రముఖుడు, మొదటివాడైన నమ్మల్వార్ పరమ పదం వెళ్లే ఘట్టాన్ని భక్తియుతంగా, నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు మంగళవారం ఉదయం 6.30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.