తెలంగాణ

పంచాయతీ ఎన్నికలకు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 16: జనవరి 10లోపు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుమెరకు యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం సిద్దమవుతుంది. బిసి రిజర్వేషన్లపై హైకోర్టులొ కేసువేయడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లికి ముందస్తు ఎన్నికలు ముంచుకొని రావడంతో ఆగస్టులో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలకు బ్రేకు పడి మూడునెలల ప్రత్యేకఅధికారుల పాలన కొనసాగింది. ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని 100రోజులలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో బీసీ జనగణన జరిపి రిజర్వేషన్లు ప్రకటించేపనిలో యంత్రాంగం నిమగ్నమయ్యారు. జిల్లాలోని 16మండలాలలో 401గ్రామపంచాయతీలలో బాగంగా 3,484 వార్డులకు సభ్యులను ఎన్నుకునేందుకు రంగం సిద్దంచేస్తున్నారు. 13,14తేదీలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలనుండి అభ్యంతరాలను స్వీకరించడం పూర్తిచేసి 19వరకు తుది ఓటర్ల జాబీతాలను ప్రకటించి ఎన్నికల కమీషనుకు అందజేసి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 16మండలాలలోని 401గ్రామపంచాయతీలలో 4,14,059మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతుంది. ఎన్నికలు నిర్వహించేందుకు 3,484పోలింగ్ కేంద్రాలను ఎంపికచేయగా 8,021మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికి 2,900మంది సిబ్బంది అందుబాటు ఉండగా మిగిలిన వారిని ఎంపికచేసి పిఓలు, ఎపిఒలతోపాటు సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణనిచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 3విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాగం ఎన్నికల కమీషన్‌కు ప్రతిపాదనలు సిద్దంచేస్తున్నారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే జనవరి 10లోపు గ్రామపంచాయతీ ఎన్నికల కసరత్తు పూర్తవుతుందని అధికారులు తెలియజేసారు.