తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేవరకూ.. అలుపెరుగని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 17: ప్రజలకు మాయమాటలు చెప్పిఅధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దించేవరకు ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లాలని పాలకులు చేయని పనుల గురించి తెలుసుకోవాలని, ప్రభుత్వానికి సవాల్‌గా ఉండాలని కోరారు. నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని, ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. ఏ విషయాన్నయినా అంతర్గతంగా చర్చించుకోవాలని బహిర్గతం కాకూడదన్నారు. పార్టీకి ప్రజాభిమానం ఉందని, నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా చేస్తామని నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఎవరిని నియమించాలో తనకు సూచించాలని కోరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి విషయంలో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, చిరుమరి కృష్ణయ్య, పి.రాంలింగయ్యలకు అందుబాటులో కార్యకర్తలు, నాయకులు సూచనలు చేయాలని కోరారు. నియోజకవర్గానికి పార్టీకి ప్రత్యేక సలహాదారుడిగా ఉంటానని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. రానున్న గ్రామపంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, ఎంపీ ఎన్నికల సందర్భంగా ఐక్యంగా పని చేసి విజయం సాధించాలని కోరారు. నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటానని కాంగ్రేస్ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈవిఎంలలో టాంపరింగ్ జరిగిందని, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌లలో కూటమి అభ్యర్ధికి ఓట్లు వేశామని జనం భారీగా చెబుతున్నారని, అయితే కూటమి అభ్యర్థులు ఓడిపోవడం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, చిరుమరి కృష్ణయ్య, పి.రాంలింగయ్య, మహబూబ్‌అలి, పొదిల శ్రీనివాస్, జి.వేణుగోపాల్‌రెడ్డి, పి.కోటిరెడ్డి, కె.శంకర్‌నాయక్, బసవయ్యగౌడ్, మాలి కాంతరెడ్డిలు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్‌పీ మాజీ నాయకుడు జానారెడ్డి