తెలంగాణ

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 18: జిల్లాలో పెథాయ్ తుపాను వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు జరిపిస్తామని రైతులు ఆందోళన చెంద వద్దని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 121కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, తుపాను వర్షాలు పడుతున్నందునా ధాన్యం తడువకుండా అవసరమైన టార్పాలిన్లు, గోనే సంచులు అందుబాటులో ఉంచేలా ఆదేశించామన్నారు. యార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు ఆదేశించామన్నారు. ఇప్పటిదాకా జిల్లాలో 204291.280 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 204005.620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధం
బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. మంగళవారం మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతు నేటి నుండి 22వ తేదిలోపు బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 5లక్షల 17వేల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. వంద శాతం లబ్ధిదారులకు చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక మండల, పట్టణ కేంద్రాల్లోని గోదాంలకు చీరలు తరలించి పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు.