తెలంగాణ

ఎప్పటికీ ప్రజల మధ్యే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 18: ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం మొదటి సారిగా వరంగల్‌లోని వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే తాము మాత్రం ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఎన్నికలను తమ జీవితాల్లో చూడలేదన్నారు. డబ్బు, మద్యం, విచ్చలవిడిగా వెదజల్లడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అంతా ఏకపక్షంగా పనిచేసినందునే టీఆర్‌ఎస్‌కు ఆ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా ఏ పోలింగ్ బూత్‌లో చూసినా అధికార పార్టీకి ప్రతిపక్షా పార్టీకి ఓట్ల తేడా పెద్ద మొత్తంలో ఉందన్నారు. ఎమ్మెల్సీగా తనను అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రను కొండా మురళి తీవ్రంగా ఖండించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి ఇది వర్తించా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాము కదా అని మమ్ముల్ని, మా కార్యకర్తలను వేదిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ విషయంలో అనర్హత వేటు వేయాలని చూస్తే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావాడానికి అనేక పార్టీలు సహకరిచాయని అన్నారు. తనపై ఉన్న గౌరవంతో ఏ పార్టీ కూడా పోటీకి దిగనందునే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందన్నారు. ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే మహాకూటమి నాయకులు ఓడిపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా సీఎం కేసీఆర్ చింతమడ్కలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలిక్యాప్టర్‌లో వస్తే ఆయనను ప్రజలు చుట్టుముట్టి ఘెరావ్ చేశారని, అంతేకాకుండా అనేక గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను రానివ్వని పరిస్థితుల నుంచి వేల మెజార్టీ రావడంలో మతలబు ఏమిటని వారు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం వారిని ఈవీఎంలే గెలిపించాయని ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల అవినీతిపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నందునే అసెంబ్లీని రద్దు చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుని మళ్లీ అసెంబ్లీని రద్దు చేస్తారా అని కొండా దంపుతలు ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌లను ఓపెన్‌చేసి తిరిగి లెక్కిస్తారా? అని వారు నిలదీశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా తమడబ్బు పట్టుబడలేదని, కేవలం అది పోలీసుల సృష్టేనని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కొందరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఓడించే కుట్ర అమలు జరిగిందన్నారు. ప్రశ్నించే గొంతుక ఉండద్దనే ఉద్దేశంతో కేసీఆర్ నా..నీ అనే తేడా లేకుండా టార్గెట్ చేసి ఓడించారని అన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులు