తెలంగాణ

30 రోజుల్లో కేటీపీపీ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/గణపురం, డిసెంబర్ 18 : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో స్టేటార్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిన విషయం వాస్తవమేనని జెన్-కో సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కేటీపీపీని ఆయన సందర్శించారు. మొదట రెండో దశలో ఏర్పడిన సాంకేతిక లోపాలపై ప్లాంట్‌ను సందర్శించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్‌లు కేవలం 56 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉన్నాయని, కేవలం తెలంగాణలో ఉన్న కేటీపీపీ రెండో దశ 89 శాతం, మొదటి దశ 87 శాతం పీఎల్‌ఎఫ్‌తో మంచి స్థానంలో ఉన్నాయన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే జైపూర్ విద్యుత్ ప్లాంట్‌తో పాటు ఎన్‌టీపీసీలో కూడా రెండో దశలో వచ్చిన సాంకేతిక సమస్యలే వచ్చాయన్నారు. వాటిని బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు తప్ప ఎవరూ గుర్తించలేరన్నారు.
బీహెచ్‌ఈఎల్‌కు సంబంధించిన ఇంజనీర్లు హరిద్వార్, రామచంద్రాపూర్ నుండి కేటీపీపీకి వస్తున్నారని, వారు రూటార్, స్టేటార్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తే సమస్య తెలుస్తుందన్నారు. అప్పటి వరకు మనం చేసేదేమి లేదన్నారు. ఆ ఖాళీ సమయాన్ని భర్తీ చేసుకునేందుకు వార్షిక మరమ్మతులను 30 రోజుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేటీపీపీ ఇంజనీర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, సాంకేతిక సమస్యలు ఎవరి తప్పిదం కాదన్నారు. రోటార్‌కు సంబంధించిన సామాగ్రి జిందాల్ వారి వద్ద ఉందని, వారిని కూడా సంప్రదిస్తున్నామన్నారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ కూడా రాష్ట్రంలో తగ్గిందని, ఈ సమయంలోనే వార్షిక మరమ్మతులు చేయడం సరైందనే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. మొదటి దశలో సాంకేతిక సమస్యలకు బొగ్గే కారణమా? అని సీఎండీని అడగగా ఆయన స్పందిస్తూ 75 రోజుల పాటు నిరంతరాయంగా నడిచిందని, మనకు నాణ్యమైన బొగ్గు అందుబాటులో లేదని, ఉన్న బొగ్గుతోనే ప్లాంట్‌ను కొనసాగిస్తున్నామని, బాయిలర్ ట్యూబ్‌లు పగలడం సహజమేనని, గతంలో కన్నా సాంకేతిక సమస్యలు కేటీపీపీలో తగ్గాయని సీఎండీ తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య, సీఈ సిద్ధయ్య, సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు.

చిత్రం..కేటీపీపీలో విలేఖరులతో మాట్లాడుతున్న సీఎండీ ప్రభాకర్ రావు