తెలంగాణ

చైనా పర్యటనకు కాటారం విద్యార్థి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జనవరి 14: చైనా స్టడీ టూర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి డోంగ్రీ రాజబాబు ఎంపికయ్యారు. ఈనెల 17న హైదరాబాద్ నుండి విమానంలో చైనాకు వెళ్లనున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ అక్కడే ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న రాజబాబు ఉంటున్నాడు. ఎస్సీ అభివృద్ధి, ఎస్సీ రెసిడెన్షియల్ సొసైటీ నేతృత్వంలో ఆ సంస్థ సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్‌టెన్షన్ గ్లోబల్ అనే కార్యక్రమం ద్వారా ఇతర దేశాల్లో స్టడీ టూర్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చైనాలోని షాంగై ప్రాంతంలో స్ట్రీట్ సర్వేతో పాటు హ్యూమన్ ఎంపవర్‌మెంట్ చిల్డ్రన్ యూత్‌తో భావాలను పంచుకోవడం ఆ దేశంలో టూరిస్టు ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారు.