తెలంగాణ

గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 14: తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టి బాధితులకు బాసటగా నిలవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతి చేసినట్లు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా తెలిపారు. ఉన్న ఊళ్లో ఉపాధికరువై బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టి అక్కడ చేతినిండా పని దొరకక భారతీయులు కొందరు అర్ధాకలితో అలమటిస్తుండగా, మరికొందరు పస్తులుండి తలదాచుకుంటున్నారని, ఏజెంట్ల మోసాలతోనే ఇదంతా జరుగుతోందని సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ షేక్ చాంద్‌పాషా వెల్లడించారు. ఉపాధికోసం గల్ఫ్ వెళ్లినవారికి అక్కడ చేతినిండా పనిదొరకక అనేకమంది ఆత్మహత్యలు చేసుకోగా, కనీసం కడసారి చూపునకు నోచుకోని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు అక్కడ మృత్యువాత పడిన పట్టించుకోని పరిస్థితి ఉందని, కంపెనీలలో సక్రమంగా పనిలేక పారిపోయి ఇతర చోట్ల ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్నవారు అనేక మందిని అక్కడి పోలీసులు అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెడుతుండగా నరకయాతన అనుభవిస్తున్నారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు వివరించినట్లు తెలిపారు. తెలిసో తెలియకో ఏజెంట్ల మాయ మాటలను నమ్మి పరాయి దేశం వెళ్లి అక్కడ క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి గల్ఫ్ బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తూ ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరానన్నారు. ఏజెంట్ల మోసాలకు అనేక మంది అమాయకులు ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో అవస్థలు పడుతున్నారని వివరించారు. విజిటింగ్ వీసాలతో గల్ఫ్ దేశాలకు పంపించడంతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని, వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని కోరారు. అక్కడ మరణించిన వారి కడసారి చూపుకోసం ఉన్న ఊరు, కన్న వారు అనేక రోజులుగా ఎదురు చూసిన చాలా మంది చివరిసారిగా చూసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు బడ్జెట్‌లో గతేడాది వంద కోట్లు కేటాయించినట్లు వెల్లడించారని, అయితే ఇందులో ఇంతవరకు ఎంత మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారో వెల్లడించాల్సిన అవసరముందన్నారు. గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జిఓ ఇచ్చినా ఇంతవరకు అమలుచుకునోచుకోలేదని, దాన్ని వెంటనే పునరుద్ధరించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కోరగా, ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు గల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా వెల్లడించారు.
చిత్రం..టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతి చేస్తున్న గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా