తెలంగాణ

నేత్రపర్వంగా గోదాదేవి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 14: మాంగల్యం..తంతునానే..లోకరక్ష..హేతునహా..అంటూ వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య శ్రీగోదారంగనాయకస్వామిల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన జిల్లాకేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గోదా కళ్యాణాన్ని వేలాదిమంది భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల నామస్మరణాలు మధ్య నేత్రపర్వంగా శాస్త్రోక్తంగా అంత్యత ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా రంగనాయకస్వామి, గోదాదేవిలకు పట్టువస్త్రాలు, నగలతో అతి సుందరంగా అలంకరించి సంప్రదాయ పద్దతిలో పెళ్లిపీటల మీదకు తీసుకువచ్చారు. ఆతర్వాత విష్వక్సేన పూజతో మొదలై కంకణదారణ, జీలకర్రబెల్లం, గుణగణాలు, కన్యదానం, తలంబ్రాలు వంటి ఘట్టాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీతతో కలిసి హజరై స్వామివారు అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేసి కళ్యాణోత్సవతంతులో పాల్గొన్నారు. స్ధానిక శంకర్‌విలాస్ సెంటర్ నుండి వెంకటేశ్వర ఆలయం వరకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో జగదీశ్‌రెడ్డి దంపతులు శోభాయాత్రగా తరలివచ్చారు. ఈ కళ్యాణోత్సవంలో 900మంది (జంటలు) దంపతులు పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్‌చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో వేదబ్రాహ్మణులు సాంప్రదాయపద్దతిలో కళ్యాణమహోత్సవాన్ని చూపరులకు చూడముచ్చటగా జరిపించారు. కళ్యాణతంతును వేలాదిమంది భక్తులు నేత్రపర్వంగా తిలకించి భక్తిపారవశ్యంలో ఒలలాడారు. మంగళ్యధారణ తంతు ముగిసిన తర్వాత స్వామివారికి సంబంధించిన పూలచెండు ఆట, బిందెలో ఉంగరం వెతుకులాటలకు సంబంధించిన తంతును మాజీమంత్రి దంపతులు జరిపించారు. కళ్యాణోత్సవానికి భక్తులు భారీసంఖ్యలో హజరుకాగా వారికి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆలయకమిటీ వారు ఏర్పాట్లు చేపట్టారు. ఈ కళ్యాణోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మొరిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ గవ్వా వనజ, వార్డు కౌన్సిలర్ చలమల్ల నర్సింహా, వికాస తరంగిణి అధ్యక్ష, కార్యదర్శులు టీఎస్‌వీ.సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, డాక్టర్ రాంమూర్తి, పట్టణ ప్రముఖులు బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, నూకా వెంకటేశం గుప్తాతో పాటు సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్రం.. గోదాదేవి కల్యాణ దృశ్యం