తెలంగాణ

అసర్ నివేదిక ఆధారంగా ప్రమాణాల మెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యా స్థితిగతుల నివేదిక ‘అసర్’లో తెలంగాణ రాష్ట్ర ప్రమాణాలు తగ్గినట్టు పేర్కొందని ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించిన సర్వే ప్రకారం 2007తో పోలిస్తే బడిలో చేరని పిల్లల సంఖ్య 3 శాతం తగ్గింది. బడిలో ఉన్న పిల్లల్లో ప్రమాణాలు 2.8 శాతం పడిపోయినట్టు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగాప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్ధుల సంఖ్య 2014లో 30.8 శాతం కాగా, 2018లో 30.9 శాతం ఉంది. తెలంగాణలో 2012లో రెండో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం చదవగలిగే 8 వ తరగతి పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో 83.6 శాతం ఉండగా జాతీయ సగటు 73 శాతం మాత్రమే, ప్రైవేటు పాఠశాలల్లో 92.2 శాతం నుండి అది 88.9 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 6 నుండి 14 ఏళ్ల వయస్సున్న పిల్లల్లో 57.4 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాణాలు ఆశాజనకంగా లేకపోయినా ఇటీవల ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతునే ఉందని తేలింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడం, ఉన్న ఖాళీలు కూడా గత ఆరేళ్లుగా భర్తీ చేయకపోవడం, ప్రాధమిక పాఠశాలల్లో పూర్వ ప్రాధమిక తరగతులను ఏర్పాటు చేయకపోవడం, పర్యవేక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం ప్రమాణాల పతనానికి కారణమవుతోంది. గత పది సంవత్సరాలుగా ప్రధమ్ సంస్థ సర్వే చేసి వార్షిక స్థితి గతులపై ఒక నివేదిక విడుదల చేస్తున్నా దానిని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమని యూటీఎఫ్ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అధ్యయనం కోసం రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నేత రవి కోరారు.