తెలంగాణ

వర్శిటీలు, జాతీయ సంస్థల్లో భారీగా పెరగనున్న సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈలు, ఇతర జాతీయ సంస్థల్లో ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే మిగిలిన రిజర్వుడ్ వర్గాలకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సీట్లకు ఈ ఏడాది భారీగా కనీసం 40 శాతం మేర పెంచాలని యోచిస్తోంది. ప్రతి విద్యాసంస్థలో 100 సీట్లు ఉన్న చోట వచ్చే విద్యాసంవత్సరం నుండి 140 సీట్లకు పెరుగుతాయి. ఆ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ అన్ని కోర్సుల్లో కలిపి లక్ష సీట్లు వరకూ పెరిగే వీలుంది. వీటిని సూపర్ న్యూమరీ సీట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆర్ధికంగా వెనుకబడిన ఉన్నత కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆమోదించగా, మరికొన్ని రాష్ట్రాలు ఈ బిల్లును అమలుచేసే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఒకటి రాష్ట్ర యూనివర్శిటీ, రెండు డీమ్డ్ వర్శిటీలు కలిపి కేంద్రం పరిధిలోకి వచ్చే సంస్థలు 8 ఉండగా, రాష్ట్ర యూనివర్శిటీలు 16 ఉన్నాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు 266 కాగా వాటిలో 1,26,468 సీట్లున్నాయి. 145 ఫార్మసీ కాలేజీల్లో 11,438 సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 2966 సీట్లు, 347 ఎంబీఏ కాలేజీల్లో 41,796 సీట్లు, 225 బిఈడీ కాలేజీల్లో 22670 సీట్లు, 17 లా కాలేజీల్లో 2850 సీట్లు, 1278 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,83,823 సీట్లు 171 ఎంటెక్ కాలేజీల్లో 15152, 130 ఎం ఫార్మసీ 7820 సీట్లు, 13 ఎల్‌ఎల్‌ఎం కాలేజీల్లో 580 సీట్లు, 18 బీపీఈడీ కాలేజీల్లో 1760 సీట్లు, యూజీడీ పీఈడీ నాలుగు కాలేజీల్లో 350 సీట్లు ఉన్నాయి. డిగ్రీ సీట్లు కాకుండా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనే దాదాపు 2.33 లక్షల సీట్లున్నాయి. వీటికి డిగ్రీ సీట్లు కలిపి చూస్తే 5.5 లక్షల సీట్లు వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఎస్సెస్సీలో 5 లక్షల మంది, ఇంటర్‌లో 4 లక్షల మంది ఉంటున్నారు. ఈ సీట్లకు అదనంగా 40 శాతం మేరకు సూపర్‌న్యూమరీ సీట్లు పెంచాలని కేంద్రం ఆదేశిస్తోంది.